రైలు కిందపడి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానిక రైల్వేస్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : రైలు కిందపడి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానిక రైల్వేస్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సోమేశ్వపురానికి చెందిన నల్లమిల్లి బాలక్రిష్ణారెడ్డి, శివానిరెడ్డి(26) దంపతులు వ్యాపార పనుల నిమిత్తం ఎనిమిదేళ్లుగా మండలంలోని శివునిపల్లిలో నివాసముంటున్నారు.
బాలక్రిష్ణారెడ్డి వాయిదా ల పద్ధతిన టీవీలు, ఫ్రిజ్‌లు, బీరువాలు తదితర పరికరాలను విక్రయించే వ్యాపారం చేస్తున్నా డు. వారి ఏకైక కుమార్తె విజయశ్రీ స్థానిక సెయింట్ థామస్ హైస్కూల్‌లో యూకేజీ చదువుతోంది. ఇటీవల కుటుంబ కలహాలు, వ్యక్తిగత సమస్యలతో శివాని అసంతృప్తితో ఉంటోంది.
రోజూలాగే మంగళవారం మధ్యాహ్నం కుమార్తెకు పాఠశాలలో భోజనం తినిపించింది. అనంతరం స్థానిక రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆమె అందరూ చూస్తుండగానే సికింద్రాబాద్ నుంచి లక్నో వైపు వెళ్లే యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో శివాని దేహం ముక్కలుముక్కలై గుర్తించకుండా మారింది.
కాగా మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన బాలక్రిష్ణారెడ్డి భార్య ఇంట్లో లేకపోవడంతో ఎటు వెళ్లిందోనని చూసేసరికి రైల్వేస్టేషన్‌లో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి చూశాడు. రైలు పట్టాల సమీపాన ఉన్న చీరె, మృతురాలి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని చూసి భార్యగా గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.