
ఉరివేసుకుని మహిళ బలవన్మరణం
బొమ్మలరామారం : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో మంగళవారంచోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందినపత్తి పుష్ప(30) కుటుంబ తగాదాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల క్రితం పుష్పకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందంటూ పంచాయతీ జరిగింది. దాంతో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన మృతురాలి భర్త గంగారాం ఇంటికి వచ్చి తలుపు తీయగాపుష్ప దూలానికి ఉరి వేసుకుని కనిపించింది. మృతురాలి తండ్రి మోతె పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.