చౌటుప్పల్: మండలంలోని తాళ్లసింగారం గ్రామం లో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న యువతి మృతికి, ప్రియుడే కారణమని ఆరోపిస్తూ బంధువులు, కుటుంబ సభ్యులు అతడి ఇంటి ఎదుటే శవాన్ని పూడ్చిపెట్టారు. తాళ్లసింగారానికి చెందిన నల్ల సత్తయ్య-పద్మల రెండో కుమార్తె వసంత(21), అదే గ్రామానికి చెందిన ఎర్రగోని పర్వతాలు-ముత్తమ్మల రెండో కుమారుడు మహేష్(24) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నా రు. వీరిద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో, ఇరు వర్గాల పెద్ద మనుషులు కూర్చొని, వివాహం చేసేలా ఒప్పందం చేశారు. మహేష్‌కు సోదరుడు ఉండడంతో, అతడి వివాహమయ్యాక వీరి పెళ్లి చేస్తామని నిశ్చయించా రు.
కట్నకానుకలను కూడా మా ట్లాడా రు. ఏడాది అవుతున్నా, మహేష్ సోదరుడు రఘుకు సంబంధం కుదరలేదు. దీంతో వీరివెళ్లి వాయిదాపడుతూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వసంత ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వసంత తల్లిదండ్రులు మహేష్ వేధిం పుల వల్లే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీ సులు మహేష్‌తో పాటు అతని తల్లిదండ్రులపై కేసునమోదు చేశారు. శని వారం చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు.
రెండు కుటుంబాల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. వసంత మృతికి మ హేషే కారణమని, తల్లిదండ్రులు, బంధువులు కలిసి మృతదేహాన్ని తీసుకెళ్లి, అతడి ఇంటి ఎదుట పూడ్చిపెట్టారు. ఘోరి కట్టబోతుండగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమం లో పోలీసులకు, బంధువులకు వాగ్వాదం జరిగింది. ఘోరి కడతామని బంధువులు భీష్మిం చుకు కూర్చోవడంతో, పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరిం చాయి. చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్, రామన్నపే ట సీఐలు భూపతి గట్టుమల్లు, కె.శివరాంరెడ్డి, బాల గంగిరెడ్డిలు, రామన్నపేట, చిట్యాల, భూదాన్ పోచంపల్లిల ఎస్‌ఐలు,దాదాపు 70మంది పోలీసులు అక్కడ మోహరించారు. ఇంటి వద్ద నుంచి బంధువులను, గ్రామస్తులను పంపించారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూడ్చిన మృతదేహం వెలికితీత
మహేష్ ఇంటి ఎదుట పూడ్చిపెట్టిన మృతదేహాన్ని శనివారం రాత్రి వెలికితీశారు. రెండు కుటుంబాల పెద్దమనుషులు కూర్చొని మాట్లాడుకుని ఓ నిర్ణయా నికి వచ్చారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. రాత్రి వసంత మృతదేహాన్ని వెలికితీసి దహనసంస్కా రాలు నిర్వహించారు.
ప్రియుడి ఇంటి ఎదుట శవం పూడ్చివేత
Published Sun, Mar 8 2015 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement
Advertisement