Vasanta
-
ప్రమాదకరంగా సాయిబాబా ఆరోగ్యం
- నాగ్‌పూర్ జైల్లో ప్రొఫెసర్ నరకం అనుభవిస్తున్నారు - ములాఖత్ అనంతరం మీడియాకు వివరించిన సతీమణి వసంత నాగ్‌పూర్: నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనే నేరంపై యావజ్జీవ శిక్ష అనుభవిస్తోన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆయన భార్య వసంత మీడియాకు తెలిపారు. మంగళవారం నాగ్‌పూర్ జైలులో ములాఖత్ ద్వారా ప్రొఫెసర్ ను కలుసుకున్న ఆమె.. అనంతరం జైలు లోపల జరుగుతున్న విషయాలను వెల్లడించారు. 90 శాతం దివ్యాంగుడైన సాయిబాబా పలు వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ జైలులో ఆయనకు ఎలాంటి వైద్య సౌకర్యాలు కల్పించడంలేదని వసంత చెప్పారు. ఈ విషయాలను మరుగునపెడుతూ, సాయిబాబా ఆరోగ్యంగానే ఉన్నారంటూ అక్కడి డాక్టర్లు నకిలీ రిపోర్టులు తయారు చేశారని ఆరోపించారు. ప్రొస్టేట్ సమస్య వల్ల కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేని స్థితిలోనూ జైలు అధికారులు, వైద్యులు మిన్నకుండిపోయారని అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబాకు వెళ్లే ఉత్తరాలేవీ ఆయనకు అందజేయడంలేదని, పత్రికల్లో ఆయనకు సంబంధించిన వార్తలుగానీ, బయట జరుగుతున్న విషయాలేవీ ఆయనకు తెలియనివ్వడంలేదని వసంత తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నేరం రుజువు కావడంతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా సహా మరో నలుగురు దోషులు హైకోర్టులు ఆశ్రయించారు. ఈలోపే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటం కుటుంబసభ్యులను, సన్నిహితులను కలవరపాటుకు గురిచేస్తోంది. -
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
తడ్కల్ : మేనమామ తిట్టాడన్న మనస్తాపంలో ఓ యువతి చేదబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కంగ్టి మండలం దెగుల్‌వాడీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. కంగ్టి ఎస్ఐ ప్రదీప్‌బాబు కథనం మేరకు.. కోనాపూర్ వసంత (21) మూడు నెలల వయస్సులో తల్లి మరణించడంతో అప్పటి నుంచి మేనమామ పిడికిలి గోవర్ధన్‌రెడ్డి వద్ద ఉంటోంది. వసంత తల్లి మరణాంతరం తండ్రి సంగారెడ్డి మరో వివాహం చేసుకుని నిజామాబాద్ జిల్లా కొడప్గల్లో ఉంటున్నాడు. కాగా బుధవారం ఇంటి పని విషయంలో మేనమామ భార్య అరుణతో వసంత గొడవ పడడంతో గోవర్దన్‌రెడ్డి ఇద్దరినీ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన వసంత గ్రామ సమీపంలోని చేద బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు వసంత మేనమామ గోవర్ధన్‌రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రదీప్‌బాబు తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట శవం పూడ్చివేత
చౌటుప్పల్: మండలంలోని తాళ్లసింగారం గ్రామం లో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న యువతి మృతికి, ప్రియుడే కారణమని ఆరోపిస్తూ బంధువులు, కుటుంబ సభ్యులు అతడి ఇంటి ఎదుటే శవాన్ని పూడ్చిపెట్టారు. తాళ్లసింగారానికి చెందిన నల్ల సత్తయ్య-పద్మల రెండో కుమార్తె వసంత(21), అదే గ్రామానికి చెందిన ఎర్రగోని పర్వతాలు-ముత్తమ్మల రెండో కుమారుడు మహేష్(24) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నా రు. వీరిద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో, ఇరు వర్గాల పెద్ద మనుషులు కూర్చొని, వివాహం చేసేలా ఒప్పందం చేశారు. మహేష్‌కు సోదరుడు ఉండడంతో, అతడి వివాహమయ్యాక వీరి పెళ్లి చేస్తామని నిశ్చయించా రు. కట్నకానుకలను కూడా మా ట్లాడా రు. ఏడాది అవుతున్నా, మహేష్ సోదరుడు రఘుకు సంబంధం కుదరలేదు. దీంతో వీరివెళ్లి వాయిదాపడుతూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వసంత ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వసంత తల్లిదండ్రులు మహేష్ వేధిం పుల వల్లే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీ సులు మహేష్‌తో పాటు అతని తల్లిదండ్రులపై కేసునమోదు చేశారు. శని వారం చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. వసంత మృతికి మ హేషే కారణమని, తల్లిదండ్రులు, బంధువులు కలిసి మృతదేహాన్ని తీసుకెళ్లి, అతడి ఇంటి ఎదుట పూడ్చిపెట్టారు. ఘోరి కట్టబోతుండగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమం లో పోలీసులకు, బంధువులకు వాగ్వాదం జరిగింది. ఘోరి కడతామని బంధువులు భీష్మిం చుకు కూర్చోవడంతో, పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరిం చాయి. చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్, రామన్నపే ట సీఐలు భూపతి గట్టుమల్లు, కె.శివరాంరెడ్డి, బాల గంగిరెడ్డిలు, రామన్నపేట, చిట్యాల, భూదాన్ పోచంపల్లిల ఎస్ఐలు,దాదాపు 70మంది పోలీసులు అక్కడ మోహరించారు. ఇంటి వద్ద నుంచి బంధువులను, గ్రామస్తులను పంపించారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పూడ్చిన మృతదేహం వెలికితీత మహేష్ ఇంటి ఎదుట పూడ్చిపెట్టిన మృతదేహాన్ని శనివారం రాత్రి వెలికితీశారు. రెండు కుటుంబాల పెద్దమనుషులు కూర్చొని మాట్లాడుకుని ఓ నిర్ణయా నికి వచ్చారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. రాత్రి వసంత మృతదేహాన్ని వెలికితీసి దహనసంస్కా రాలు నిర్వహించారు.