కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది చిన్నారితో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోడి సమీపంలో చోటు చేసుకుంది.
అన్నానగర్: కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది చిన్నారితో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోడి సమీపంలో చోటు చేసుకుంది. బోడి సమీపంలోని బి. మీనాక్షిపురం కన్‌డియమ్మన్ ఆలయ వీధికి చెందిన కాళియప్పన్ కుమార్తె అరసమణి (28). ఈమెకు పెరియకుళం దేవదానపట్టికి చెందిన గణేషన్ (30)తో వివాహం జరిగింది. వీరికి పెళ్లై రెండేళ్లైనా సంతనం కలగలేదు. దీంతో అహల్య (ఒకటిన్నర ఏళ్ల)అనే చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు.
ఈ స్థితిలో భార్యభర్తలకు మధ్య తరచూ కలహాలు వస్తుండడంతో అరసమణి తన తల్లిదండ్రుల ఇంటికి చిన్నారిని తీసుకొని వెళుతున్నాని చెప్పి అక్కడి నుంచి వెళ్లింది. ఈ విషయాన్ని ఈమె తల్లిదండ్రులకు భర్త గణేషన్ తెలిపాడు. కాని వారిద్దరు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో వెతికారు. వారి ఆచూకి లభించలేదు. ఈ క్రమంలో బోడి సమీపంలోని మేలసొక్కనాథపురంలోని ఓ బావిలో చిన్నారితో మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి మృతి చెందిన వారిని బయటకి తీశారు. విచారణలో మృతి చెందింది అరసరమణి, అహల్య అని తేలింది. కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని అరసమణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.