మైసూరు: అందం ఆమె పాలిట శాపమైంది, చదువుకుని ఖాళీగా ఉండడం ఎందుకని ఓ చిన్నపాటి ఉద్యోగంలో చేరితే పై అధికారి కామాంధునిగా మారాడు. సెస్కాంలో ఉన్నతాధికారి వేధింపులను తట్టుకోలేక మహిళా కంప్యూటర్ ఆపరేటర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కొడగు జిల్లా మడికెరి వద్ద మంగళవారం జరిగింది.
ఫోన్ చేయి, వాట్సప్ చాట్ అని ఒత్తిడి
వివరాలు.. మడికెరి తాలూకా కగ్గోడ్లు గ్రామానికి చెందిన సౌమ్య అనే మహిళ గతేడాది మేలో మడికెరి సెస్కాం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరారు. అయితే సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) వినయ్ ఆమైపెన కన్నేశాడు. నాకు ఫోన్ చేయి, వాట్సాప్ చాట్ చేయి అంటూ సౌమ్యను తరచూ వేధించేవాడని సౌమ్య భర్త, విశ్రాంత జవాన్ తెలిపారు. వినయ్ వేధింపులు అలాగే కొనసాగుతుండడంతో విరక్తి చెందిన సౌమ్య ఇంట్లో పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త మడికెరి మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏఈఈ వినయ్‌పై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment