
క్షణికావేశంతో ఐదు నెలలకే ముగిసిన వివాహ బంధం
ఆత్మహత్యకు పాల్పడ్డ భర్త ఆవేదనతో గొంతు కోసుకొని ఆస్పత్రిపాలైన భార్య
చిత్తూరు జిల్లా : కుటుంబంలో వచ్చి కలతలతో ఐదు నెలల వివాహ బంధం అర్ధాంతరంగా ముగిసింది. భార్యతో వచ్చిన గొడవకు వునస్థాపం చెంది భర్త సురేష్ (28) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు ఆవేదన చెందిన భార్య సోని(25) గొంతు కోసుకొని ఆస్పత్రికి చేరింది. కుప్పంలో బుధవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...
తమిళనాడు రాష్ట్రం పర్చూరు పట్టణానికి చెందిన సురేష్‌కు కర్ణాటక రాష్ట్రం కోలారుకు చెందిన సోనికు గత ఐదు నెలల క్రితం వివాహమైంది. అనంతరం సురేష్ కుప్పంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ పట్టణ సమీపంలోని ఎన్టీఆర్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రవుంలో రెండు రోజుల క్రితం కోలారులో జరిగిన సోని చెల్లెలు నిశ్చిర్థానికి భార్యభర్తలిద్దరూ హాజరయ్యూరు. అక్కడ సోని కన్నా ఎక్కువ నగలు, నగదు పెట్టి వివాహం చేస్తున్నారని సోని ఆమె భర్త సురేష్‌లు అత్తవూవులతో గొడవపడి కుప్పం చేరుకున్నారు.
ఇంట్లో మంగళవారం రాత్రి భార్యభర్తల వుధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. సోని తల్లిదండ్రులు తనకు బంగారు నగలు ఎక్కువ ఇవ్వకుండా పెళ్ళి చేశారంటూ సురేష్ భార్య సోనిల వుధ్య తగాదా పెరిగింది. దీంతో వునస్థాపం చెందిన సురేష్ బుధవారం తెల్లవారుఝామున ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోనే ఉన్న సోని విషయుం తెలుసుకుని ఆవేదన చెంది భర్త లేని జీవితం తనకొద్దంటూ కత్తితో గొంతు కోసుకుని కుప్పకూలింది.
వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ సురేష్‌ను బంధువులు స్వగ్రావుం తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు తీసుకెళ్ళారు. ఈ విషాద సంఘటనపై చుట్టుపక్కల ప్రాంత వాసులను కలచివేసింది.బాదితుల పిర్యాదు మేరకు కుప్పం ఎస్ ఐ రావుస్వామి కేసు నమెదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.