సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరస్తులు ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి పొలిటీషియన్ వరకు ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ డబ్బులు కాజేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో నగ్న వీడియో కాల్స్ చేసి కొందరు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని ఓ ఎమ్మెల్యే సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది.
వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత సదరు ఎమ్మెల్యేకు వీడియో కాల్ వచ్చింది. గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ రావడంతో ఎవరో అనుకుని.. వీడియో కాల్‌ను ఎమ్మెల్యే ఆన్సర్ చేశారు. దీంతో ఫోన్ స్క్రీన్‌పై ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే కాల్‌ను కట్ చేశారు.
ఈ క్రమంలో వీడియో కాల్ నుంచి తేరుకున్న ఎమ్మెల్యే.. నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)లో కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్‌నంబర్ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే, తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా వీడియోకాల్ చేశారా? లేక నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులే చేసి ఉంటారా? అనే అనుమానం ఎమ్మెల్యేకు కలిగింది. తన ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు బ్లాక్‌మెయిల్ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారనే సందేహంతో ఆయన వెంటనే నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)లో సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్‌నంబర్ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment