బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కష్టమే: కేటీఆర్‌ | Ktr Comments At Mankondoor Brs Cadre Meeting | Sakshi
Sakshi News home page

బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కష్టమే: కేటీఆర్‌

Published Sun, Apr 28 2024 7:18 PM | Last Updated on Sun, Apr 28 2024 7:18 PM

Ktr Comments At Mankondoor Brs Cadre Meeting

సాక్షి,కరీంనగర్‌: బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గోదావరి జలాలు మనకు అందక ముందే కిందకు పంపాలని బీజేపీ చూస్తోందన్నారు. నియోజకవర్గాలు పునర్విభజన చేసి మన నియోజకవర్గాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోందన్నారు. మానకొండూర్‌లో ఆదివారం(ఏప్రిల్‌27) నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్‌లో కేటీఆర్‌ మాట్లాడారు. 
‘బండి ఒక్క పనైనా చేశావా చెప్పు...? బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 2014లో జన్ ధన్ ఖాతాల పేరిట బడాభాయ్ మోదీ మోసం చేశాడు. 2024లో ఆరు గ్యారెంటీల పేరుతో చోటేభాయ్ రేవంత్ మోసం చేశాడు. అలుగునూర్ చౌరస్తాలో కరీంనగర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నిలబడితే గుర్తు పట్టేటోడు లేడు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో ప్రణాళిక లేకనే మనం ఓడిపోయాం. బండి సంజయ్ కు ఏమీ తెలవదు. ఏమీ తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. 
దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప వేరే ఏమీ తెలియని వాడు బండి సంజయ్‌. ఇలాంటి బీజేపీ నాయకుణ్ణి ఓట్లతోనే తొక్కాలి. దేశానికి మోదీ ప్రధాన ద్రోహి. నిత్యావసర సరుకుల పెంచి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు.  రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో 30 లక్షల కోట్లు వసూల్ చేశాడు. అదానీ కంపెనీ వాళ్లకు రూ. 15 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ దేశ ద్రోహి. ఈడీ దాడులతో నాయకులను భయపెట్టుడం తప్ప ఏమీ చేయడు. మన కాలర్‌ ఎగిరేయాలంటే 10,12 ఎంపీ స్థానాలు గెలిపించాలి’ అని కేటీఆర్‌ కోరారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement