తుమకూరు(బెంగళూరు): ఉన్నతాధికారి లైంగిక వేధింపులతో మహిళా అధికారిణి తన కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన గురువారం తుమకూరులో చోటు చేసుకుంది. వివరాలు.. నగరంలోని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఓ మహిళ అధికారిణిగా పని చేస్తోంది. ఏడాది కాలంగా జాయింట్ డైరెకర్ సుబ్రమణ్య లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సదరు మహిళా అధికారిణి గురువారం కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించింది. అయితే సహచర ఉద్యోగులు వెంటనే గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
అనంతరం బాధితురాలు జాయింట్ డైరెక్టర్‌పై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, నెల నెలా మాముళ్లు ఇవ్వాలని బెదరిస్తున్నాడని, సిబ్బంది ముందు దూషించేవాడని, ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి రావాలని వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. జిల్లా కలెక్టర్ మోహన్‌రాజు, జిల్లా పంచాయతీ సీఈఓ శాంతారామ్, మహిళ,శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ నంజేగౌడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధితురాలితో మాట్లాడి వివరాలు రాబట్టారు. అధికారి సుబ్రమణ్యం పైన కఠిన చర్యలను తిసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉన్నతాధికారి లైంగిక వేధింపులు
Published Fri, Sep 9 2016 9:03 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
Advertisement