సర్వే ఎఫెక్ట్: ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కరీంనగర్: తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేలో తన పేరు నమోదు చేసుకోలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది.
సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లు తన పేరు నమోదు చేసుకోలేదని ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్టు అధికారులు తెలిపారు.