
తాళ్లరేవు(తూర్పుగోదావరి జిల్లా): గాడిమొగ పంచాయతీ బాబానగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని రేవు అనూష గురువారం స్థానిక రక్షిత మంచినీటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అనూష తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా కువైట్‌లో ఉంటున్నారు.
అనూష తాళ్లరేవులోని పెద్దమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ఉదయం అనూష కనిపించకపోవడంతో బంధువులు, స్థానికులు ఆమె కోసం గాలించారు. స్థానిక రక్షిత మంచినీటి చెరువులో సాయంత్రం ఆమె మృతదేహం లభించింది. మృతికి గల కారణాలు తెలియరాలేదు.
చదవండి:
వేమగిరిలో వరుస హత్యల కలకలం
దారుణం: యువతిపై సామూహిక లైంగిక దాడి
Comments
Please login to add a commentAdd a comment