ఆడిపాడే వయసులో.. భక్తిమార్గమే గొప్పదని..  | Mumukshu Vidhi kumari who was intiated into Jainism in Hospet | Sakshi
Sakshi News home page

ఆడిపాడే వయసులో.. భక్తిమార్గమే గొప్పదని.. 

Published Thu, Jan 19 2023 7:58 AM | Last Updated on Thu, Jan 19 2023 8:08 AM

Mumukshu Vidhi kumari who was intiated into Jainism in Hospet - Sakshi

సాక్షి, హొసపేటె: ఆడిపాడే వయసులో ఓ యువతి ఇహలోక అంశాలను త్యజించి సన్యాసదీక్ష తీసుకుంది. హొసపేటె నగరంలో నివాసముంటున్న వ్యాపారి దివంగత కాంతిలాల్‌ జిరావర్, రేఖా దేవి దంపతుల నలుగురు కుమార్తెల్లో మూడో కుమార్తె ముముక్ష బుధవారం జైన మత సంప్రదాయాల ప్రకారం సన్యాసదీక్ష స్వీకరించింది. స్థానిక హోటల్‌ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జైనమునులు ఆమెకు సన్యాస దీక్ష ఇచ్చారు.  

ఆధ్యాత్మిక ప్రపంచమే మిన్న  
19 ఏళ్ల ముముక్ష మాట్లాడుతూ తన నాలుగేళ్ల వయస్సులో తండ్రి ఓ ప్రమాదంలో మృతి చెందారు. అన్ని కష్టాలను అధిగమించి తాను 10వ తరగతిలో 95.8 శాతం, పీయూసీలో 99 శాతం మార్కులతో పాసైనట్లు తెలిపింది. లౌకిక ప్రపంచం కన్నా తనకు ఆధ్యాత్మిక ప్రపంచమే మిన్నగా భావించి ఈరోజు జైన సన్యాసాన్ని స్వీకరించానని తెలిపింది. ఈ సందర్భంగా  బంధుమిత్రులు ఆమెను భారమైన హృదయాలతో అభినందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement