రోడ్డుపై డబ్బులు వసూలు చేస్తున్న యువతుల అరెస్ట్‌ | Police Arrested Rajasthan Girls Who Were Collecting Money On Road | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో రాజస్థాన్‌ యువతులు

Published Thu, Feb 18 2021 9:26 PM | Last Updated on Fri, Feb 19 2021 12:03 AM

Police Arrested Rajasthan Girls Who Were Collecting Money On Road - Sakshi

విజయనగరం‌ : రోడ్డుపై వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న రాజస్తాన్‌​ యువతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని రామచం‍ద్రపురం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన పదిమంది యువతులు తారాపురం నుంచి సాలూరు వెళ్లే జాతీయ రహదారిలో లారీలు, కార్లు ఆపి డబ్బులు అడుగుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి ఫొటోలను క్రైమ్‌ పోలీస్ ‌స్టేషన్‌కు పంపించి గతంలో వారిపై ఏమైనా కేసులు నమోదయ్యాయేమో అడిగి తెలుసుకున్నారు. కేసులు ఏమీ లేవని తెలియడంతో బొబ్బిలిలో స్టేషన్‌లో కొంత మంది ఉన్నారని తెలిసి ఈ పదిమందిని బొబ్బిలి పోలీసులకు అప్పగించినట్లు హెచ్‌సీ శ్రీనివాసరావు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement