ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, దండేపల్లి (ఆదిలాబాద్): ఏడాది క్రితం నిశ్చియమైన పెళ్లి మూడుసార్లు వాయిదా పడటంతో మనస్తాపం చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్పై పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. కాసిపేట మండలం దేవాపూర్‌కు చెందిన సెడ్మాక సింధు (23)కు ఏడాది క్రితం దండేపల్లి మండలం ఇప్పలగూడకు చెందిన ఆత్రం మహేశ్‌తో పెళ్లి నిశ్చయమైంది. ఇంతలో దగ్గరి బంధువులు ముగ్గురు మృతి చెండంతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చారు. అయితే సింధు, మహేశ్ ఒకరినొకరు ఇష్టపడటం, మేనరికం కావడంతో పెళ్లికాకుండానే ఇప్పలగూడలో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో సింధు గర్భం దాల్చింది.
పెళ్లి మూడుసార్లు వాయిదా పడటం, దీంతోపాటు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మొదట లక్సెట్టిపేటకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తండ్రి భగవంత్‌రావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పై తెలిపారు.
చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్)
Comments
Please login to add a commentAdd a comment