బేస్‌బాల్‌ మ్యాచ్‌లో యువతి అర్థనగ్న ప్రదర్శన.. గెంటేసిన నిర్వాహకులు | Spectator Accidentally Shows Breasts Security kicked Her Out-of Stadium | Sakshi
Sakshi News home page

బేస్‌బాల్‌ మ్యాచ్‌లో యువతి అర్థనగ్న ప్రదర్శన.. గెంటేసిన నిర్వాహకులు

Published Sat, Jun 11 2022 7:37 PM | Last Updated on Sat, Jun 11 2022 8:18 PM

Spectator Accidentally Shows Breasts Security kicked Her Out-of Stadium - Sakshi

బేస్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఒక యువతి చేసిన పని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. స్టేడియంలో అందరూ చూస్తున్నారనే విషయాన్ని మరిచిపోయిన యువతి ఫూటుగా మద్యం సేవించి అర్థనగ్న ప్రదర్శనతో రెచ్చిపోయింది. సోయి లేకుండా ప్రైవేట్‌ పార్ట్స్‌ కనబడేలా డ్యాన్స్‌ చేసింది. ఇదంతా గమనించిన అక్కడి సిబ్బంది యువతిని హద్దులు మీరుతున్నారంటూ హెచ్చరించారు. వారి హెచ్చరికలు బేఖాతరు చేయని సదరు యువతి మత్తు మైకంలో మరింత శ్రుతి మించింది.


చివరికి ఆమె దగ్గరికి వెళ్లి కుదరుగా కూర్చోవాలని.. లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా యువతికి చెప్పారు. ఎంత చెప్పినా ఆమె ధోరణి మారకపోవడంతో చిర్రెత్తిపోయిన సిబ్బంది ఆమెను స్టేడియం నుంచి బయటికి పంపించేశారు. ఇదంతా గత శనివారమే చోటుచేసుకున్నప్పటికి వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా లాస్‌ ఏంజిల్స్‌ డార్జర్స్‌, న్యూయార్క్‌ మెట్స్‌ మధ్య బేస్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో లాస్‌ ఏంజిల్స్‌ డార్జర్స్‌ 6-1 తేడాతో విజయం సాధించింది.

చదవండి: మ్యాచ్‌కు ఆటంకం కలిగించిన అభిమాని.. క్రికెటర్‌ చర్య వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement