![Mentally Ill Young Woman Is Wandering In Kurnool - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/9/young-woman.jpg.webp?itok=iFuAYmwt)
సాక్షి, కర్నూలు: సి.బెళగల్ మండల పరిధిలోని ముడుమాల గ్రామంలో రెండురోజులుగా గుర్తు తెలియని బాలిక (14 ఏళ్లు) సంచరిస్తోంది. గ్రామస్తులు చేరదీసి వివరాలు అడిగితే తనది నంద్యాల అని, పేరు వైశాలి అని మాత్రమే చెబుతోంది. మీ తల్లిదండ్రులు ఎవరు..ఇంటి నుంచి ఎందుకొచ్చావు అని అడిగితే మాత్రం సమాధానం చెప్పకుండా దూరంగా వెళ్లిపోతోంది. ‘నన్ను ఇక్కడి నుంచి మా ఊరికి పంపిస్తే చేతులు కోసుకుని చనిపోతా’ అంటూ కూడా బెదిరిస్తోంది. బాలిక మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని..అందుకే అలా ప్రవర్తిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. బాలికను తమ వద్ద ఉంచుకుని పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు. (20 నెలల తరువాత గుర్తుకొచ్చిన చిరునామా)
Comments
Please login to add a commentAdd a comment