
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శనివారం అర్థరాత్రి యువతులు హల్‌చల్ చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు అమ్మాయిలు వీరంగం సృష్టించారు. అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై రాళ్లతో దాడి చేశారు. వీరి వెంట మరో నలుగు యువకులు కూడా ఉన్నారు. యువతుల ఘర్షణతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని బంజారాహిల్స్‌లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment