
ప్రతీకాత్మక చిత్రం
పెనమలూరు(విజయవాడ): పోరంకిలో యువతిని కిడ్నాప్ చేసిన యువకుడిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా వైరాకు చెందిన యువతి (18) పోరంకిలో ఉంటున్న మామయ్య ఇంటికి గత నెలలో వచ్చింది.
చదవండి: ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్..
ఆమె గత నెల 5వ తేదీన కుటుంబ సభ్యులతో పోరంకిలో షాపింగ్ చేస్తున్న సమయంలో పరిచయం ఉన్న ఎం.శ్రీనివాసరావు అనే యువకుడు వచ్చి ఆమెను బలవంతంగా బైక్ పై తీసుకు వెళ్లాడు. ఆమెను సబ్బవరం తీసుకు వెళ్లి వదిలేశాడు. ఆమె తిరిగి ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలిపింది. ఈ ఘటన పై కుటుంబ సభ్యులు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment