Poranki
-
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
సాక్షి, కృష్ణా జిల్లా: పోరంకిలో టీడీపీ అరాచకం సృష్టించింది. టీడీపీ గూండాలు దాదాగిరికి పాల్పడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు గుర్తించాయి. ప్రశ్నించినందుకు జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రాముపై కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నెల్లూరు: ఓటమి భయంతో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన అభ్యర్థి మేరీగా మురళిపై దాడికి యత్నించారు. సంగం మండలం చెన్నవరప్పాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఢిల్లీ బాబు గాయపడ్డారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు, ముసునూరులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. -
దేశభాషలందు తెలుగు లెస్స : ద్రౌపది ముర్ము
-
పోరంకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
మామయ్య ఇంటికి వచ్చిన ఖమ్మం యువతి.. షాపింగ్ చేస్తుండగా యువకుడు షాకింగ్ ట్విస్ట్..
పెనమలూరు(విజయవాడ): పోరంకిలో యువతిని కిడ్నాప్ చేసిన యువకుడిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా వైరాకు చెందిన యువతి (18) పోరంకిలో ఉంటున్న మామయ్య ఇంటికి గత నెలలో వచ్చింది. చదవండి: ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్.. ఆమె గత నెల 5వ తేదీన కుటుంబ సభ్యులతో పోరంకిలో షాపింగ్ చేస్తున్న సమయంలో పరిచయం ఉన్న ఎం.శ్రీనివాసరావు అనే యువకుడు వచ్చి ఆమెను బలవంతంగా బైక్ పై తీసుకు వెళ్లాడు. ఆమెను సబ్బవరం తీసుకు వెళ్లి వదిలేశాడు. ఆమె తిరిగి ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలిపింది. ఈ ఘటన పై కుటుంబ సభ్యులు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. -
పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. అయినప్పటికీ: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు.. అవును నిజమే.. తమ బాధ్యతను తాము సక్రమంగా నెరవేరుస్తున్న వారినే చాలా మంది టార్గెట్ చేస్తారు. సేవా భావంతో ముందుకు సాగుతున్నా.. వారిపై నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. అయితే, వాటన్నంటిని తట్టుకుని నిలబడినపుడే మనం చేస్తున్న పనులకు మరింత సార్థకత చేకూరుతుంది. ఫలితం ఆశీర్వాదాల రూపంలో ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, అఖండ విజయం సాధించి, అధికారం చేపట్టిన ఆయన రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టడం సంక్షేమ పాలనను కొత్తపుంతలు తొక్కిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహమ్మారి కోవిడ్-19 ప్రబలుతున్న సమయంలోనూ సేవలు అందించారు. ఈ క్రమంలో, వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉగాది సందర్భంగా నేటి నుంచి వారిని సత్కరించి, అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృష్ణాజిల్లాలోని పోరంకిలో సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థపై విష ప్రచారం చేస్తున్న పచ్చ మీడియా తీరుపై తనదైన శైలిలో స్పందించారు. వారి పాపానికి వారిని వదిలేయండి ‘‘గొప్ప సేవాభావంతో పనిచేస్తున్న వలంటీర్ వ్యవస్థ మీద కూడా కొన్ని సందర్భాలల్లో ఎల్లో మీడియా గానీ, ప్రతిపక్షంలోని కొంత మంది నాయకులు గానీ అవాకులు, చెవాకులు మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా కూడా మీ జీవితాలల్లో మీరు క్రమశిక్షణతో మెలిగినంతకాలం ఎలాంటి విమర్శలకు కూడా వెరవవద్దు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. పండ్లున్న చెట్టు మీదనే రాళ్ల దెబ్బలు పడతాయి. కాబట్టి, వాళ్లు, మిమ్మల్ని ఏదో అంటున్నారని వెనకడుగు వేయవద్దు. వారి పాపానికి వాళ్లను వదిలేయండి. వారి కర్మకు వారిని వదిలేయండి. ధర్మాన్ని మీరు నెరవేర్చండి. ప్రభుత్వం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నేను సందర్భంగా మరోసారి చెబుతున్నా’’ అంటూ సీఎం జగన్ వలంటీర్లలో స్ఫూర్తి నింపారు. చదవండి: గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్: సీఎం జగన్ ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు -
అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా పోరాటం
పోరంకి(పెనమలూరు) : రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పటు చేసి, ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం ఆడాలని చూస్తోందని, దీనిపై పోరాడనున్నట్లు సీపీఐ(ఎంఎల్) రెడ్‌స్టార్ నాయకుడు, ఓపీడీఆర్ జాతీయ కన్వీనర్ చిగురుపాటి భాస్కరరావు తెలిపారు. గురువారం ఆయన గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రలు గుజరాత్, రాజస్థాన్‌లో అణు కేంద్రాలు ఏర్పాటుకు వ్యతిరేకించారన్నారు. అయితే చంద్రబాబునాయుడు రైతుల వద్ద నుంచి 32 వేల ఎకరాలు అమరావతిలో భూమి సేకరించాననే ధీమాతో వ్యవహరిస్తూ రాష్ట్రంలో అణుకేంద్రాలు ఏర్పాటుకు కేంద్రానికి అంగీకారం తెలిపారని ఆరోపించారు. 32 వేల మెగా వాట్ల సామర్థ్యంతో ఆరు కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, ప్రజల జీవితాలతో చెలగాటమాడటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు వ్యతిరేక సభ అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా, కోల్లా వెంకయ్య 18వ వర్ధంతి సభ శనివారంవ విజయవాడలో బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో సీపీఐ(ఎంల్) కేంద్ర కార్యదర్శి కేఎస్ రామచంద్రన్, పర్యావరణవేత్తలు డాక్టర్ కె.బాబూరావు, సౌమ్యదతా పాల్గొంటారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఓపీడీఆర్ తెలంగాణ కార్యదర్శి బి.నరసింహా, విప్లవ మహిళా సంఘం అఖిలభారత ఉపాధ్యక్షురాలు మీదుసాయుద, రాష్ట్ర సభ్యుడు మరీదు ప్రసాద్‌బాబు పాల్గొన్నారు. -
పోరంకిలో భారీ దొంగతనం
రూ.21 లక్షల విలువైన సొత్తు అపహరణ పోరంకి (పెనమలూరు) : పోరంకి గ్రామం నారాయణపురం కాలనీలో గురువారం వేకువజామున ఓ ఇంటి తాళాన్ని దొంగలు పగులగొట్టి రూ.21 లక్షలు విలువ చేసే సొత్తు అపహరించుకుపోయారు. పెనమలూరు పోలీ సులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకి నారాయణపురం కాలనీలోని ప్లాట్ నంబరు 11లో కాంట్రాక్టర్ పెందుర్తి రంగవరప్రసాద్, పాపాయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేరు. కాగా దంపతులు బ్యాంక్ పనిమీద ఈనెల 26న జిల్లాలోని రుద్రపాక గ్రామానికి వెళ్లారు. రంగవరప్రసాద్ ఇంట్లో పని చేసే మహిళ గురువారం ఉదయం వచ్చి చూడగా ఆయన ఇంటి తాళం పగులగొట్టి ఉంది. పక్కనే ఉన్న వారి బంధువులకు ఈ విషయాన్ని చెప్పింది. వారు అందజేసిన సమాచారంతో తూర్పు డివిజన్ ఏసీపీ మహేశ్వరరాజు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. దీనిపై సమాచారం అందుకున్న రంగవర ప్రసాద్ దంపతులు తిరిగి వచ్చి బీరువాలో దాచిన దాదాపు 70 కాసుల బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి వస్తువులు, రూ.90 వేల నగదు, 12 పట్టుచీరలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. మేనల్లుడి పెళ్లి ఉండటంతో బంగారమంతా ఇంట్లోనే ఉంచామని, అవన్నీ చోరీకి గురయ్యాయని బాధిత దంపతులు పోలీసులకు వివరించారు. పెళ్లి కోసం ఉంచిన వస్తువులు ఎత్తుకెళ్లారు కాగా రంగవరప్రసాద్ మేనల్లుడు పాలడుగు రాజేష్‌కుమార్ పెద ఓగిరాలలో ఉంటున్నాడు. అతనికి తండ్రి లేడు. రాజేష్‌కుమార్ నిశ్చి తార్థం వచ్చేనెల 22న వివాహం మార్చి నాలుగో తేదీన ఉంది. ఈ పెళ్లిని వీరే జరి పించాల్సి ఉంది. వివాహం కోసం రాజేష్ 20 కాసుల బంగారాన్ని మేనమామ ఇంటిలో ఉంచాడు. అపహరణకు గురైన సొత్తులో అవి కూడా ఉన్నాయి. పెనమలూరు పోలీస్‌స్టేషన్ సిబ్బందితోపాటు సీసీఎస్ సీఐ సుబ్బారావు సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలు, వాచ్మెన్లు ఉన్నా.. ఇదిలా ఉండగా, కాలనీలో దొంగలు 44, 45 ప్లాట్లతో పాలు పలు ఇళ్లలో చోరీకి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. వాటి యజమానులు ఇళ్లలో ఉండటంతో దొంగల ప్రయత్నం ఫలించలేదు. కాలనీలో సీసీ కెమెరాలు, వాచ్మెన్లు ఉన్నా దొంగలు చాకచక్యంగా భారీ చోరీకి పాల్పడటంతో స్థాని కులు, పోలీసులు కంగుతిన్నారు. రంగవరప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆఫీసులో దాచిన బంగారం మాయం సత్యనారాయణపురం : ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగుల కొట్టి నగలు, నగదు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురం అడివి శేషగిరిరావు వీధిలో సి.హెచ్.దుర్గారావు నివసిస్తున్నారు. ఇతను ఇటీవల ఇల్లు ఖాళీ చేసి పటమటకు వెళ్లి పోయారు. గతంలో ఉన్న ఆ ఇంటిని ఆఫీసుగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బ్యాంక్‌నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని ఆఫీసులో ఉంచారు. ఎప్పటిలానే బుధవారం తాళ ం వేసి వెళ్లారు. గురువారం వచ్చి చూసే సరికి తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా అల్మారాలో ఉంచిన తొమ్మిది గ్రాముల నగలు, రెండు వేల నగదు కనిపించలేదు. దీంతో సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. సింగ్‌నగర్‌లో మరో ఘటనలో... మధురానగర్ : సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంటిలో దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్‌నగర్ ఎక్సెల్‌ప్లాంట్ రోడ్డులో బొకెనాల శాంతి కుటుంబం నివాసం ఉంటోంది. శాంతి 27న ఇంటికి తాళం వేసి తల్లితో కలసి గొల్లపూడి నల్లకుంటలో ఉంటున్న చెల్లెలి ఇంటికి వెళ్లారు. 28వ తేదీ రాత్రి వచ్చి చూసేసరికి ఇంటి వెనుక తలుపు తెరచి ఉంది. ఇంట్లోని బీరువా పగులగొట్టి ఉంది. ఇంట్లోని 57 గ్రాముల బంగారు వస్తువులు, బ్రాస్లెట్, రింగ్, చెవిదిద్దులు, పట్టీలు,30 వేల నగదు మాయమయ్యాయి. శాంతి తల్లి మిర్యాల సత్యవతి ఫిర్యాదు మేరకు సింగ్‌నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ పరిస్థితిని పరిశీలించారు. -
బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం పోరంకిలో ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, ఎం.వెంకయ్య నాయుడు నుంచి సభ్యత్వం స్వీకరిస్తున్న కె.హరిబాబు విజయవాడ బ్యూరో : త్వరలో జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, వచ్చేసారి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తమ సర్కార్లు వస్తాయని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ చెప్పారు. తాము కోరిన సీట్లు శివసేన ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నామని తెలిపారు. పోరంకిలో ఆదివారం జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూడీ మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలపై తమకు అమితమైన గౌరవం ఉందని, అంతమాత్రాన ఆ రాష్ట్రాల్లో తమ పార్టీ బలపడడం ఆగదని స్పష్టం చేశారు. ఏపీలో ఈ ఏడాది పది లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని, ఐదేళ్లలో ఆ సంఖ్య 80 లక్షలకు చేరాలని సూచించారు. పార్టీ అంటే జీవిత భాగస్వామి: వెంకయ్య కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, తుళ్లూరులో పచ్చగా కనిపించే పొలాలు పోతున్నాయంటే బాధగానే ఉంటుందని, కానీ రాజధాని కోసం తప్పదని, కానీ లక్షల ఎకరాలు కావాలని తాను అనలేదని చెప్పారు. భూములు తీసుకుంటున్న రైతులకు న్యాయం జరగాలన్నారు. పార్టీని జీవిత భాగస్వామిగా భావించాలని, పార్టీ సభ్యత్వం ఒక పవిత్ర బంధమని నాయకులు, కార్యకర్తలకు ఉద్బోధించారు. బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా పార్టీలోకి రాావచ్చని చెప్పిన వెంకయ్య.. పదవుల కోసం వచ్చే వారిని మాత్రం తాను ఆహ్వానించబోనని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని, వ్యక్తిత్వం లేని నాయకులే కులం, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ.. ప్రతి మూడేళ్లకోసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. డిసెంబరు 6న అన్ని జిల్లాల్లోనూ ఒకేసారి సభ్యత్వ నమోదును ప్రారంభించాలని నాయకులకు సూచించారు. హరిబాబుకు కేంద్ర మంత్రి రూఢీ సభ్యత్వం ఇవ్వగా మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులకు హరిబాబు సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు అడపా నాగేంద్ర సహా రాష్ట్రంలోని పలువురు నేతలు బీజేపీలో చేరారు. కల్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి పెనమలూరు : యనమలకుదురులోని శ్రీరామలింగేశ్ర స్వామి ఆలయంలో దాత సంగా నరసింహారావు నిర్మించిన పలు నిర్మాణాలను కేంద్ర మంత్రి వెంకయ్య ప్రారంభించారు. కల్యాణ మండపం, హోమ మండపం, అన్నదాన సత్రాల ప్రారంభోత్సవంగా వైభవంగా నిర్వహించారు. వీరికి పూజారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, మాణిక్యాలరావు స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అనురాధ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీపీ కనకదుర్గ, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసరావు, సర్పంచి మూడే సుభద్ర ఉన్నారు. మంత్రులకు సన్మానం మంత్రులు వెంకయ్య, ఉమ, మాణిక్యాలరావులను దాత నరసింహారావు సన్మానించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ రీజినల్ డెరైక్టర్ చంద్రశేఖర్‌అజాద్, ఏసీ దుర్గాప్రసాద్, ఆలయ కార్యదర్శి ఎన్.భవాని, మాజీ కార్యదర్శి దూళిపాళ్ల సుబ్రమణ్యం, పూజారి సాగర్, పర్యవేక్షకుడు గంగాధర్ పాల్గొన్నారు.