అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా పోరాటం
అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా పోరాటం
Published Thu, Sep 15 2016 8:51 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
పోరంకి(పెనమలూరు) : రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పటు చేసి, ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం ఆడాలని చూస్తోందని, దీనిపై పోరాడనున్నట్లు సీపీఐ(ఎంఎల్) రెడ్‌స్టార్ నాయకుడు, ఓపీడీఆర్ జాతీయ కన్వీనర్ చిగురుపాటి భాస్కరరావు తెలిపారు. గురువారం ఆయన గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రలు గుజరాత్, రాజస్థాన్‌లో అణు కేంద్రాలు ఏర్పాటుకు వ్యతిరేకించారన్నారు. అయితే చంద్రబాబునాయుడు రైతుల వద్ద నుంచి 32 వేల ఎకరాలు అమరావతిలో భూమి సేకరించాననే ధీమాతో వ్యవహరిస్తూ రాష్ట్రంలో అణుకేంద్రాలు ఏర్పాటుకు కేంద్రానికి అంగీకారం తెలిపారని ఆరోపించారు. 32 వేల మెగా వాట్ల సామర్థ్యంతో ఆరు కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, ప్రజల జీవితాలతో చెలగాటమాడటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపు వ్యతిరేక సభ
అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా, కోల్లా వెంకయ్య 18వ వర్ధంతి సభ శనివారంవ విజయవాడలో బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో సీపీఐ(ఎంల్) కేంద్ర కార్యదర్శి కేఎస్ రామచంద్రన్, పర్యావరణవేత్తలు డాక్టర్ కె.బాబూరావు, సౌమ్యదతా పాల్గొంటారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఓపీడీఆర్ తెలంగాణ కార్యదర్శి బి.నరసింహా, విప్లవ మహిళా సంఘం అఖిలభారత ఉపాధ్యక్షురాలు మీదుసాయుద, రాష్ట్ర సభ్యుడు మరీదు ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.
Advertisement