National convenor
-
మోదీకీ రిటైర్మెంట్ ఇస్తారా?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చర్యలకు ఆరెస్సెస్ సమాధానం చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ‘జనతా కీ అదాలత్’ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు. ‘‘75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలని బీజేపీలో నిబంధన ఉంది. ఎల్కే అడ్వాణీ వంటి నేతకు కూడా దీన్ని వర్తింపజేశారు. ఈ నిబంధనను మోదీకి కూడా వర్తింపజేస్తారా? అడ్వాణీ మాదిరిగానే మరో ఏడాదికి మోదీని కూడా ప్రధాని పదవి నుంచి తప్పిస్తారా?’’ అని భగవత్‌ను ప్రశ్నించారు. ఆరెస్సెస్‌ను కూడా మోదీ ఖాతరు చేయడం లేదనే అర్థం ధ్వనించేలా, ‘కొడుకు చివరికి తల్లిపైకే తల ఎగరేసేంత పెద్దవాడయ్యాడా?’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘పారీ్టలను విచ్ఛిన్నం చేయడానికి, బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకోవడాన్ని ఆర్ఎస్ఎస్ సమరి్థస్తోందా? నేతలపై అవినీతిపరులనే ముద్రవేసి, చివరికి వారిని బీజేపీలో చేర్చుకోవడం సంఘ్‌కు ఇష్టమేనా? బీజేపీ సాగిస్తున్న ప్రస్తుత రాజకీయాల పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా? సైద్ధాంతికంగానూ, అన్ని రకాలుగానూ బీజేపీకి మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ ఇక మీదట పారీ్టకి అవసరమే లేదన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యలు విన్నాక మీకేమనిపించింది? వీటన్నింటిపై స్పందించండి. బదులివ్వండి’’ అని భగవత్‌ను కోరారు. దేశంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, పదవుల కోసం కాదని స్పష్టంచేశారు. రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష ఏ తప్పూ చేయని తనపై అవినీతి ఆరోపణలు రావడంతో కలత చెంది సీఎం పదవికి రాజీనామా చేశానని కేజ్రీవాల్ అన్నారు. గత పదేళ్లలో గౌరవం సంపాదించుకున్నాను తప్పితే డబ్బు సంపాదించలేదని వ్యాఖ్యానించారు. ‘‘దసరా నవరాత్రుల తర్వాత అధికారిక నివాసం వీడతా. ప్రజలే నాకు వసతి కలి్పస్తారు’’ అన్నారు. కేజ్రీవాల్ ప్రశ్నలపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఆయనకు నైతిక విలువలే లేవంటూ ఎక్స్‌లో ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు. కేజ్రీవాల్ రాముడు, నేను లక్ష్మణుడినిఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో తనకున్నది రామలక్ష్మణుల సంబంధమని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా అభివర్ణించారు. ఏ రావణుడూ తమను విడదీయలేడంటూ బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జన్తా కీ అదాలత్‌లో సిసోడియా ప్రసంగించారు. అవినీతి రావణుడిపై పోరాటం సాగిస్తున్న రాముడు కేజ్రీవాల్ పక్కన లక్ష్మణుడిలా ఉంటానన్నారు. -
అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా పోరాటం
పోరంకి(పెనమలూరు) : రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పటు చేసి, ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం ఆడాలని చూస్తోందని, దీనిపై పోరాడనున్నట్లు సీపీఐ(ఎంఎల్) రెడ్‌స్టార్ నాయకుడు, ఓపీడీఆర్ జాతీయ కన్వీనర్ చిగురుపాటి భాస్కరరావు తెలిపారు. గురువారం ఆయన గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రలు గుజరాత్, రాజస్థాన్‌లో అణు కేంద్రాలు ఏర్పాటుకు వ్యతిరేకించారన్నారు. అయితే చంద్రబాబునాయుడు రైతుల వద్ద నుంచి 32 వేల ఎకరాలు అమరావతిలో భూమి సేకరించాననే ధీమాతో వ్యవహరిస్తూ రాష్ట్రంలో అణుకేంద్రాలు ఏర్పాటుకు కేంద్రానికి అంగీకారం తెలిపారని ఆరోపించారు. 32 వేల మెగా వాట్ల సామర్థ్యంతో ఆరు కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, ప్రజల జీవితాలతో చెలగాటమాడటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు వ్యతిరేక సభ అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా, కోల్లా వెంకయ్య 18వ వర్ధంతి సభ శనివారంవ విజయవాడలో బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో సీపీఐ(ఎంల్) కేంద్ర కార్యదర్శి కేఎస్ రామచంద్రన్, పర్యావరణవేత్తలు డాక్టర్ కె.బాబూరావు, సౌమ్యదతా పాల్గొంటారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఓపీడీఆర్ తెలంగాణ కార్యదర్శి బి.నరసింహా, విప్లవ మహిళా సంఘం అఖిలభారత ఉపాధ్యక్షురాలు మీదుసాయుద, రాష్ట్ర సభ్యుడు మరీదు ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.