వ్యక్తి ఆత్మహత్య | man commits suicide in Shaad Nagar | Sakshi

వ్యక్తి ఆత్మహత్య

Published Fri, Jun 3 2016 9:02 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

చటాన్‌పల్లి గ్రామ శివారులోని బీవీరావు నగర్ పౌల్ట్రిలో బుధవారం ఓవ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

షాద్‌నగర్ : చటాన్‌పల్లి గ్రామ శివారులోని బీవీరావు నగర్ పౌల్ట్రిలో బుధవారం ఓవ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... కేశంపేట మండల పరిధిలోని లింగంధాన గ్రామానికి చెందిన ఇస్తారి(55) గత 15ఏళ్లుగా లక్ష్మీనారాయణకు చెందిన పౌల్ట్రీలో కూలీ పనులు చేస్తున్నాడు. ఆరు నెలలుగా కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement