పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవటంతో మనస్తాపం చెంది ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన మౌనిక, కృష్ణమూర్తిగా గుర్తించారు. వీరిద్దరి కులాలు వేరు కావటంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి పెద్దపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పురుగు మందు తాగినట్లు తెలుస్తోంది. విగతజీవులై పడి ఉండగా శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలను బట్టి వారిని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.