
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హోసూరు(కర్ణాటక): వివాహేతర సంబంధాన్ని నిలదీయడంతో భార్య బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాగలూరు సమీపంలోని దాసరపల్లిదిన్న ప్రాంతానికి చెందిన సురేష్ భార్య ఆనందమ్మ(35)కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇది తెలిసి భర్త సురేష్ భార్యను నిలదీశాడు. దీంతో ఆమె సోమవారం సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఒడిశా మహిళ...
హోసూరు: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సాయంత్రం హోసూరు సమీపంలోని బేడరపల్లిలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన గుణబుయాన్ మండోదరి (22)ని ఏడాదిన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆదివారం మండోదరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కారణాలు తెలియాల్సి ఉంది. డీఎస్‌పీ శంకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment