సాక్షి, హైదరాబాద్: సీపీఎం ఆధ్వర్యంలో ఛలో రామోజీ ఫిల్మ్‌సిటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. 2007లో అప్పటి ప్రభుత్వం 670 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అప్పట్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
అయితే ఈ స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లకుండా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం అడ్డుకుంటోందని ఆరోపించారు. అర్హులకు స్థలాలు చూపెట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. లేనిపక్షంలో రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామని సీపీఎం నాయకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment