రామోజీ ఫిలింసిటీ అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోండి | ramoji film city take action on illegal structures | Sakshi
Sakshi News home page

రామోజీ ఫిలింసిటీ అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోండి

May 21 2014 2:37 AM | Updated on Sep 2 2017 7:37 AM

రామోజీ ఫిలింసిటీ అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోండి

రామోజీ ఫిలింసిటీ అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోండి

రామోజీ ఫిలింసిటీ ప్రధానద్వారం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్‌కు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు విజ్ఞప్తి చేశారు.

గవర్నర్ సలహాదారుకు గోనె ఫిర్యాదు
 
హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీ ప్రధానద్వారం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్‌కు  ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు  విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఫిలింసిటీ ప్రధాన ద్వారం నిర్మాణం కారణంగా అనాజ్‌పూర్ గ్రామస్తులు పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిపై సంబంధిత ఆర్డీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదని గోనె ఆ వినతిపత్రంలో వివరించారు. అలాగే, తెలంగాణ ప్రాంతంలో లక్ష కోట్ల విలువైన భూమి ఆక్రమణలకు గురైందని, వీటిపై చర్యలు తీసుకోవాలని కూడా గోనె కోరారు. మాజీ ఎంపీ మధుయాష్కీ ఫోర్జరీ సర్టిఫికెట్ల వ్యవహారంలోనూ కేసు నమోదు చేయాలని సలావుద్దీన్ అహ్మద్‌కు గోనె ప్రకాశరావు మరో వినతిపత్రం అందజేశారు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement