బైక్ మీద నుంచి పడిన బాలకృష్ణ
హైదరాబాద్: సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం స్వల్పంగా గాయపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూటింగ్ లో బైక్ మీద నుంచి పడిపోయినట్టు సమాచారం.
బైక్ మీద పడిపోయిన బాలకృష్ణ కాలికి గాయమైంది. గాయపడిన బాలకృష్ణను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. స్వల్ప ప్రమాదమేనని.. కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్టు సమాచారం.