
‘రామోజీ’ ఆగడాలకు అడ్డుకట్ట వేయండి
మంత్రి నాయినికి ఫిలింసిటీ కార్మికుల విజ్ఞప్తి
ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలింసిటీలో పదిహేనే ళ్లుగా పనిచేస్తున్న తమను ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిందిగా ఆ యాజమాన్యం బెదిరిస్తోందని పలువురు కార్మికులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం టీఆర్‌ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కార్మిక చట్టాలను ఫిలింసిటీ యాజమాన్యం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఫిలింసిటీ యాజమాన్యానికి, తమకు మధ్య హైకోర్టులో, లేబర్ కోర్టులో కేసు నడుస్తోందని.. తమకు ప్రభుత్వం అండగా నిలిచి రామోజీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.