
ఫుల్ జోష్‌తో..!
రవితేజ అంటేనే ఎనర్జీ. ఆ ఎనర్జీకి నిలువెత్తు నిదర్శనంగా ‘బెంగాల్ టైగర్’ చిత్రం రూపొందుతోంది. ‘రచ్చ’ ఫేం సంపత్ నంది దర్శకుడు. రాధామోహన్ నిర్మాత. ఇందులో రవితేజ సరసన తొలిసారిగా తమన్నా, రాశీ ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత ప్రముఖ హిందీ నటుడు బొమన్ ఇరానీ నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ చేస్తున్నామనీ, వినాయక చవితికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని, ఇందులో రవితేజ పాత్ర చిత్రణ ఫుల్ జోష్‌తో ఉంటుందని దర్శక, నిర్మాతలు తెలిపారు.