పెద్దఅంబర్‌పేట (హైదరాబాద్): ఓ కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొనడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ వైపు నుంచి హయత్‌నగర్ వైపు వెళుతున్న ఓ కారు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురితో పాటు బైక్‌పై ఉన్న ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు వారిని కామినేని ఆస్పత్రికి తరలించారు.