హైదరాబాద్: రామోజీ ఫిలిం సిటీలో పనిచేస్తున్న కార్మికుల హక్కులను గ్రూపు చైర్మన్ రామోజీరావు హరిస్తున్నారంటూ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఫిలింసిటీ గ్రూప్ చైర్మన్ అయిన రామోజీరావు తమ హక్కులకు విఘాతం కల్గిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్న లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట రామోజీ ఫిలింసిటీ కార్మికులు ధర్నా చేశారు.
కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న రామోజీరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రామోజీ ఫిలింసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.