
రామోజీ ఫిల్మ్‌సిటీ భూముల స్వాధీనమేమైంది?: విమలక్క
దౌల్తాబాద్/గజ్వేల్,న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రామోజీ ఫిల్మ్‌సిటీ భూములను స్వాధీనం చేసుకుంటామన్న కేసీఆర్ వాగ్దానం ఏమైందని, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) కోకన్వీనర్ విమలక్క శనివారం ప్రశ్నించారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో మొట్టమొదటగా తానే నాగలి కడతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్‌లో వ్యవసాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీయూఎఫ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, పీఓడబ్ల్యూ, పీడీఎస్‌యా(విజృంభణ), శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర మెదక్ జిల్లా దౌల్తాబాద్, గజ్వేల్ మండలాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.