సాక్షి, హైదరాబాద్: అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖకు అధికారులు నివేదిక సమర్పించారు. జీవో 46కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కూళ్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. పాఠశాలల అనుమతులు రద్దు చేస్తే వచ్చే ఇబ్బందులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
మణికొండలోని మౌంట్ లిటేరాజ్ స్కూల్, బంజారాహిల్స్‌లోని మెరీడియన్ స్కూల్, హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్, అమీర్‌పేట్‌లోని నీరజ్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్, డీడీ కాలనీలోని నారాయణ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్స్‌పై అధికారులు నివేదిక ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment