High fees
-
పర్మిషన్ లేని పాఠశాలలపై చర్యలు
పరిగి: ప్రైవేటు విద్యాలయాలపై మండల విద్యాధికారి కొరడా ఝుళిపించారు. అకాస్మాత్తుగా సోదాలు నిర్వహించి అనుమతి లేని, పుస్తకాలు, బ్యాగులు విక్రయించిన పాఠశాలలు మూసివేయాలని ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం పట్టణ కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలను మండల విద్యాధికారి హరిశ్చందర్ తనిఖీ చేశారు. న్యూబ్రిలియంట్ టెక్నో స్కూల్లో పాఠ్యపుస్తకాలు ఉండటంతో గదిని సీజ్ చేశారు. లిటిల్ బడ్డీ స్కూల్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వెంటనే మూసి వేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలో ఎలాంటి వాణిజ్యపరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్మ్, స్కూల్ బ్యాగ్స్ ఏ వస్తువులు అమ్మినా పాఠశాల పర్మిషన్ రద్దు చేస్తామని చెప్పారు. ఫీజులు ఎక్కువ వసూలు చేయరాదని, విద్యాహక్కు చట్టం ప్రకారం గతేడాది వసూలు చేసిన విధంగానే.. ఇప్పుడు తీసుకోవాలని సూచించారు. రాతపూర్వకంగా.. గతేడాది కంటే ఇప్పుడు ఎవరైనా అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే.. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అండర్ టేకింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలని, బడిలో ఎలాంటి పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు విక్రయించమని రాతపూర్వకంగా రెండు రోజుల్లో మండల విద్యావనరుల కేంద్రంలో ఇవ్వాలని హెచ్చరించారు. ఇప్పటికే రెండు పాఠశాలల్లో దుస్తులు, పాఠ్యపుస్తకాలు విక్రయించినట్లు తెలిసిందని, వాటిని సీజ్ చేశామని, త్వరలో మళ్లీ సోదాలు చేస్తామని చెప్పారు. -
చదువు కోనుడే
కరీంనగర్: విద్యావ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రైవేట్ దోపిడీ మితిమీరుతోంది. డొనేషన్లు, ఫీజులే కాదు.. పాఠ్యపుస్తకాలు, టైలు, బెల్ట్‌లు, బ్యాడ్జిలన్నీ తమవద్దే కొనాలని గిరి గీయడంతో తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. ప్రైవేట్ స్కూళ్లపై అధికారుల నియంత్రణ కొరవడడంతో ఇష్టారాజ్యం మారింది. జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల గుండెల్లో దడ మొదలవుతుంది. గతేడాది కంటే ఈసారి 10 నుంచి 30 శాతం వరకు ఫీజులను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. తోక పేర్లు, వసతుల పేరిట దోపిడీ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు నయా దోపిడీకి శ్రీకారం చుట్టాయి. ఒక్కప్పుడు జిల్లా కేంద్రాలకే పరిమితమైన సాధారణ, కార్పొరేట్ విద్యాసంస్థలు నేడు పట్టణాలు, పల్లెల్లో సైతం పాగా వేశాయి. ఈ–స్మార్ట్, ఈ–గ్లోబల్, ఈ–టెక్నో తదితర అందమైన పేర్లను ముందుకు తగిలిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కాగా పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు వారి వద్ద పనిచేస్తున్న ఉపాధ్యాయులనే రంగంలోకి దింపడంతో పాటు పీఆర్ఓలను నియమించుకొని అడ్మిషన్‌కు ఇంత ఇస్తామంటూ ఆశ చూపుతూ విద్యావ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. ఈ తతంగాన్ని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో యాజమాన్యాల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. విద్యా హక్కు చట్టానికి తూట్లు ప్రైవేటు స్కూళ్లు విద్యాహక్కు చట్టం అమలుకు తూట్లు పొడుస్తున్నాయి. చట్ట ప్రకారం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాల్సి ఉన్నా... అలా చేయడం లేదు. ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్య అమలయ్యేలా కృషి చేస్తామంటున్న విద్యాశాఖ అధికారులు స్పష్టమైన విధి విధానాలు లేక చేతులేత్తయడం వరకే పరిమితమవుతున్నారు. జిల్లాలో ప్రైవేటు యాజమాన్యాల కింద ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 698 పైగా ఉండగా వీటిలో ప్రస్తుతం 2లక్షల వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చట్ట ప్రకారం వీరిలో నాలుగో వంతు మందికి ఉచిత విద్య అందించాలి. కానీ యాజమాన్యాలు బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నాయి. సీట్ల భర్తీకి రిజర్వేషన్ ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాలని చట్టం నిర్దేశించింది. అనాథలు, ఎయిడ్స్ బాధితులకు 5 శాతం, ఎస్సీలకు 10, గిరిజనులకు 4, బీసీలకు 6 శాతం సీట్లను కేటాయించాలి. కానీ వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు దీనిని పట్టించుకోవడం లేదు. చట్టప్రకారం సీట్ల భర్తీ జరిగితే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మంచి విద్య దొరుకుతుంది. అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం చట్టవిరుద్ధం. నిబంధనలు పాటించని విద్యాసంస్థల గుర్తింపును జీవో 1 ప్రకారం రద్దు చేస్తాం. ప్రతీ పాఠశాలలో ఫీజుల వివరాలు నోటీసుబోర్డుపై ప్రదర్శించాలి. – సీహెచ్ జనార్దన్‌రావు, డీఈవో తీరు మారాలి ప్రైవేట్ విద్యాసంస్థల పట్ల విద్యాశాఖ తీరు మారాలి. ఫీజుల దోపిడీని అరికట్టాలి. విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే. విద్యను వ్యాపారం చేస్తూ సంపన్నుల కొమ్ము కాస్తున్న సర్కార్ విద్యాహక్కు చట్టంపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలి. – మచ్చ రమేశ్, -
నాణ్యత లేని బోధనకు బ్రేక్..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లపై మరింత నిఘా పెట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రతి ప్రైవేటు స్కూల్‌ను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించే పనిలో ఉంది. ప్రతి ప్రైవేటు పాఠశాల ఈ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా చూడాలని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చారు. అనుమతి పొందిన సెక్షన్లు, స్కూల్లో చదివే విద్యార్థుల సంఖ్య, ఎంతమంది ఉపాధ్యాయులు, ఏ సబ్జెక్టుకు ఎవరు టీచర్? వాళ్ళ అర్హతలేంటి? తీసుకునే ఫీజులెంత? ఇలాంటి అంశాలతో పోర్టల్‌ను రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఇది సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించని స్కూళ్లను గుర్తించడం దీనివల్ల సాధ్యమవుతుందని, నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక ఫీజుల వసూలుకు కళ్లెం వేసేందుకు తోడ్పడుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ పోర్టల్ రూపకల్పనపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. ప్రైవేటు స్కూళ్ల సమాచారం ఇప్పటివరకు జిల్లా అధికారుల పరిధిలోనే ఉంటోంది. ఇక మీదట విద్యార్థుల తల్లిదండ్రులూ వివరాలు తెలుసుకులా వెసులుబాటు కలి్పంచనున్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) నివేదికలో రాష్ట్ర పాఠశాల విద్య 31వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ప్రమాణాలు పెంచేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలపై నియంత్రణ అవసరమని అధికారులు భావిస్తున్నారు. బోధనలో నాణ్యతపై దృష్టి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 వేల ప్రైవేటు స్కూళ్లున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం వీటిల్లో 1.75 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నిజానికి డీఎడ్‌తో పాటు టెట్ ఉత్తీర్ణులైన వారినే టీచర్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా పాఠశాలల్లో డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) చేసిన వారితోనే బోధన సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అనేక స్కూళ్లల్లో ఎలాంటి అర్హతలు లేని ఉపాధ్యాయులు కూడా బోధిస్తున్నట్టు తేలింది. దీంతో విద్యలో నాణ్యత దెబ్బతింటోందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు స్కూళ్లు మాత్రం అన్ని అర్హతలున్న టీచర్లే బోధన చేస్టున్నట్టుగా రికార్డుల్లో పేర్కొంటున్నాయి. అయితే దీనిపై ఇంతకాలం సరైన పర్యవేక్షణ లేకపోవడం పాఠశాల విద్యపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల వివరాలు, వారి అర్హత పత్రాలను ఆన్లైన్లో నమోదు చేయాలని నిర్ణయించారు. అధిక ఫీజులకు కళ్లెం.. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఏటా తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. దీన్ని కట్టడి చేయడానికి స్కూళ్ళ వారీగా ఫీజుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని నిర్ణయించారు. కోవిడ్ తర్వాత ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. దాదాపు 40 శాతం మంది ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. స్కూళ్లు సరిగా నడవకపోవడం, ఫీజులు వసూలు కావడం లేదనే సాకుతో వేతనాలు ఇవ్వకపోవడంతో, ఇంకోవైపు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో టీచర్లు ప్రైవేటు స్కూళ్లల్లో పనిచేయడం మానేశారు. దీంతో అర్హతలేని వారితో బోధన చేయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే పోర్టల్ తెస్తున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నాణ్యత పెరుగుతుంది ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్ళ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రత్యేక పోర్టల్ తేవడం వల్ల వాస్తవికత తెలుస్తుంది. ఫలితంగా పాఠశాలల్లో నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని మేం ఎన్నోసార్లు విద్యాశాఖ దృష్టికి తెచ్చాం. ఇప్పటికైనా అడుగులు పడటం సంతోషం. – పి.రాజాభానుచంద్ర ప్రకాశ్ (అధ్యక్షుడు, రాష్ట్ర హెచ్ఎంల సంఘం) -
ఫీ'జులుం'పై ఫైన్.. ఒక్కో సీటుపై రూ.2 లక్షల జరిమానా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర వృత్తి విద్యా కళాశాలలు యాజమాన్య కోటా సీట్లకు విచ్చల విడిగా ఫీజులు నిర్ణయించి వసూలు చేయడంపై రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీ కేటగిరీ సీట్ల భర్తీలోనూ నిబంధనలకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది. ఈ విధంగా చేపట్టిన ఒక్కో అడ్మిషన్‌పై రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది. అదేవిధంగా అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి విద్యార్థులకు అప్పజెప్పనుంది. ఇష్టారాజ్యంగా వసూళ్లు రాష్ట్రంలో 159 ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్, బీఈ కోర్సులు నిర్వహిస్తుండగా... వీటిలో 76 కాలేజీలు ఇంజనీరింగ్ పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎం.టెక్, ఎం.ఈ.) కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయి. మరోవైపు 238 కాలేజీలు పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో భాగమైన ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ కోటా మినహాయించి మిగతా సీట్లకు బీ కేటగిరీ, యాజమాన్య కోటా కింద అడ్మిషన్లు కల్పిస్తారు. కన్వీనర్ కోటా ప్రవేశాలు, కేటగిరీ బీ అడ్మిషన్లు, యాజమాన్య కోటాలో ప్రవేశాలకు సంబంధించి ఏఎఫ్ఆర్సీ ఫీజులు సిఫారసు చేసింది. కాలేజీల్లో వసతులు, సౌకర్యాలు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఏయే కోర్సుకు ఫీజులు ఎలా ఉండాలన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల వారీగా ఫీజులు ఖరారు చేసింది. అయితే కొన్ని కాలేజీలు ఆదాయార్జన కోసం కేటగిరీ బీ, యాజమాన్యా కోటా ప్రవేశాల్లో జిమ్మిక్కులు చేస్తున్నాయి. టీఏఎఫ్ఆర్సీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా.. డొనేషన్లు, ఇతర పద్ధతుల్లో దండుకుంటున్నాయి. ప్రవేశ పరీక్షల్లో మెరిట్, ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పక్కకు నెడుతూ అత్యధిక ఫీజులు చెల్లించే వారికి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. నిబంధనలకు తూట్లు వాస్తవానికి బీ కేటగిరీ అడ్మిషన్ల విషయంలో ఏఎఫ్ఆర్సీ సూచనలు కాలేజీలు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా కన్వీనర్ కోటాలో చివరిర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు కల్పించాలి. బీ కేటగిరీలో ఫలానా ప్రమాణాలకు అనుగుణంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తే తప్పకుండా నడుచుకోవాలి. అదేవిధంగా యాజమాన్యా కోటా ప్రవేశాల విషయంలోనూ ఉత్తమ ర్యాంకు అభ్యర్థులకు అవకాశం కల్పించాలి. ఆ మేరకు నిబంధనలు అనుసరించాలి. కానీ మెరిట్, బెస్ట్ ర్యాంకు తదితరాలను పట్టించుకోని కొన్ని కాలేజీలు.. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుతో పాటు డొనేషన్లు, ఇతర పద్ధతుల్లో విద్యార్థుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. ఈ మేరకు ఏఎఫ్ఆర్సీకి పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన కమిటీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది. అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై జరిమానాలు విధించి ముక్కుపిండి వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేసి కేటాయించిన ఒక్కో సీటుపై కనిష్టంగా రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించనుంది. మెరిట్ లేకుండా సీట్లు కేటాయించినా.. ఇక బీ కేటగిరీ అడ్మిషన్లలో ర్యాంకులు పరిగణించకుండా ఎన్ని సీట్లు కేటాయిస్తే అన్ని సీట్లపై.. ఒక్కో సీటుకు రూ.10 లక్షల లెక్కన జరిమానా విధిస్తామని ఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది. ఈ రెండు రకాల జరిమానాల వసూలుకు గాను కన్వీనర్ దగ్గర జమ చేసిన కాలేజీ నిధికి కోత పెట్టనున్నట్లు వెల్లడించింది. ఆయా కాలేజీల్లో ఎంతమంది నుంచి ఈ విధంగా వసూళ్లకు పాల్పడ్డారో గుర్తించేందుకు సిద్ధమవుతోంది. జరిమానాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన కమిటీ.. క్షేత్రస్థాయిలో అడ్డగోలు ఫీజు వసూళ్లపై ఫిర్యాదులు కూడా స్వీకరించనుంది. సరైన ఆధారాలను సమర్పిస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోనుంది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
హన్మకొండలో నారాయణ స్కూల్ బండారం బట్టబయలు..||
-
తెలంగాణలో చదువుకోవాలంటే లక్షలు కట్టాలి
-
‘కరోనా’ కక్కుర్తిని కక్కించారు!
కోవిడ్ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. నగర వైద్య చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆస్పుత్రుల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ వినతి మేరకు సిటీ ఆసుపత్రులు రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేశాయి. నగరానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్తకు అందించిన సమాచారంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స ఛార్జీలపై 2020 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత రేట్లను జారీ చేసింది చికిత్స పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు/లేబొరేటరీలు వసూలు చేసే బిల్లులపై పరిమితిని విధించింది. అయితే వాటిని ప్రైవేటు ఆసుపత్రులు ఉల్లంఘించాయి. దారి చూపిన హెల్ప్‌లైన్ రొటీన్ వార్డు అండ్ ఐసోలేషన్‌లో చేరేందుకు రోజుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.7,500, వెంటిలేటర్‌తో ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించింది. అయితే ఆసుపత్రులు మాత్రం రకరకాల పేర్లు పెట్టి అధిక ఛార్జీలు వేసి బిల్లులు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని రోగుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలొచ్చాయి. గత సంవత్సరం, కోవిడ్–19 రోగులను పదే పదే ఉల్లంఘించినందుకు కనీసం 30 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సల నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఒక హెల్ప్‌లైను ఏర్పాటు చేసి, ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని భావిస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కరోనా చికిత్స కోసం ఆసుపత్రులు వివిధ అదనపు బిల్లులను వసూలు చేస్తున్నాయని రోగులు, బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత నెల ఆఖరు వరకు ప్రభుత్వం నిర్ణయించిన చికిత్స ఛార్జీలను ధిక్కరించినందుకు 268 ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 87 ఫిర్యాదులకు రీఫండ్లు అందించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసిన బిల్లులను వాపసు చేసే విషయంపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని 87 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రూ. 1.61 కోట్లకు పైగా సొమ్మును రోగులకు వెనక్కి ఇచ్చారు. అత్యధిక రిఫండ్ ఓమ్ని ఆసుపత్రిదే... కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆసుపత్రి అత్యధికంగా రూ.27,41,948 రీఫండ్ చెల్లించింది. ఉప్పల్‌లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10,85,000, కొండాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ రూ.10,82,205 రీఫండ్ చేశాయి. బంజారాహిల్స్‌లోని సెంచురీ హాస్పిటల్స్ (రూ.10 లక్షలు), ఎల్బీ నగర్‌లోని అంకురా హాస్పిటల్ (రూ.6.1 లక్షలు), ఎల్బి నగర్‌లోని దియా హాస్పిటల్ (రూ. 6 లక్షలు), హైదరాబాద్ నర్సింగ్ హోమ్ (రూ.5 లక్షలు), సెక్రటేరియట్‌లోని మెడికవర్ హాస్పిటల్ (రూ.5.7 లక్షలు), కూకట్‌పల్లిలోని ప్రతిమ హాస్పిటల్ (రూ.8.2 లక్షలు) గచ్చిబౌలిలోని సన్‌షైన్ హాస్పిటల్ (రూ.5 లక్షలు) రోగులకు రీఫండ్ చేసిన ఆసుపత్రుల్లో ఉన్నాయి. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
అధిక ఫీజులను నియంత్రించే హక్కు మాకుంది
సాక్షి, అమరావతి: విద్యా సంస్థలు వసూలుచేస్తున్న అధిక ఫీజులను నియంత్రించే అధికారం తమకు ఉందని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీఎస్ఈఆర్ఎంసీ) గురువారం హైకోర్టుకు నివేదించింది. అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయడం తమ బాధ్యత అని కమిషన్ తరఫు న్యాయవాది బీఎస్ఎన్ నాయుడు వివరించారు. రాష్ట్రంలో 80 శాతం అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఖరారుచేసిన ఫీజులపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. విద్యను వ్యాపారంగా చూస్తున్న కొన్ని విద్యాసంస్థలే ప్రభుత్వ ఫీజులను వ్యతిరేకిస్తున్నాయన్నారు. చాలా విద్యా సంస్థలు తమ ఆదాయ, వ్యయాల వివరాలను కమిషన్‌కు ఇవ్వడంలేదని ఆయన తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ఖరారుచేసిన ఫీజులపై విద్యా సంస్థలకు అభ్యంతరం ఉంటే వాటిని కమిషన్ దృష్టికి తీసుకొచ్చే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు. కమిషన్‌ను ఆశ్రయించే అవకాశం ఉన్నా ఆ పనిచేయకుండా విద్యా సంస్థలు నేరుగా హైకోర్టును ఆశ్రయించాయని, ఇది ఎంతమాత్రం సరికాదన్నారు. ఆదాయ, వ్యయాల వివరాలన్నింటినీ కమిషన్‌కు సమర్పించి, ఫీజులను పునః పరిశీలించాలని కోరేందుకు అవకాశం విద్యా సంస్థలకు ఉందన్నారు. ఫీజులను ప్రభుత్వానికి సిఫారసు చేసే ముందు విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలతో పాటు విద్యా సంస్థల్లో ఉన్న మౌలిక సదుపాయాలను కమిషన్ పరిశీలించిందని నాయుడు చెప్పారు. ఈ వివరాలను కావాలంటే కోర్టు ముందుంచుతామన్నారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రాంతాలు, తరగతుల వారీగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారుచేస్తూ ప్రభుత్వం గత నెల 24న జీఓ 53, 54లను జారీచేసింది. వీటిని సవాలుచేస్తూ తూర్పు గోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం, ఏపీ ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం, తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ దుర్గాప్రసాదరావు గురువారం మరోసారి విచారణ జరిపారు. -
విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన
-
అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాల ప్రయోజనాల కోసమే ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ విధానానికి అందరి నుంచి మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలిదశ అడ్మిషన్లకు ఇప్పటివరకు 2.60 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. బోర్డు ఎక్కడా కొత్తగా ఏ నిబంధననూ మార్పు చేయలేదని వివరించారు. గతంలో ఆఫ్‌లైన్‌లో జరిగే పద్ధతినే ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి మార్చామని పేర్కొన్నారు. తొలివిడత ఆన్లైన్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో రామకృష్ణ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు కరోనా సమయంలో కాలేజీల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుందన్నారు. ఇంట్లో నుంచే తమకు నచ్చిన కాలేజీలో, కోరుకున్న గ్రూపులో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధార్, కొన్ని సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేసి విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్ పొందొచ్చని చెప్పారు. ఎక్కడా ఎవరికీ ఎలాంటి ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలకు కూడా ఆన్లైన్ అడ్మిషన్లవల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తమ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులను ఫీజులు కట్టించుకొని చేర్పించుకోవడం వరకే వాటి బాధ్యత అని స్పష్టం చేశారు. రామకృష్ణ ఇంకా ఏమన్నారంటే.. నిర్దేశిత ఫీజులనే కళాశాలలు తీసుకోవాలి.. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే ఫీజులను ఖరారు చేసింది. ఆ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు ఫీజులు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా నిర్దేశిత ఫీజులను మాత్రమే చెల్లించాలి. ఏ కాలేజీ అయినా ఎక్కువ ఫీజులు డిమాండ్ చేస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వాటిని ప్రాసిక్యూషన్ చేయించే అధికారం ఇంటర్ బోర్డుకు ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ) చట్టం–1983లోని సెక్షన్ 9, 10, 11 ప్రకారం ప్రభుత్వం గతేడాది మార్చిలో జీవో 57 ద్వారా బోర్డుకు ప్రత్యేకాధికారాలు కల్పించింది. అందరికీ అందుబాటులో సీట్లు రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ సహా ఇతర యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో 6 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సీట్లు రావన్న ఆందోళన వద్దు. సెక్షన్‌కు 88 మందిని అనుమతిస్తున్నాం. రిజర్వేషన్ల ప్రకారమే ప్రతి కాలేజీలో సీట్ల భర్తీ ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల వారికి సీట్లు దక్కుతాయి. గతంలో రిజర్వేషన్ల అమలు సరిగా లేనందున కొన్ని కాలేజీల్లో కొందరికి మాత్రమే అవకాశం దక్కేది. దీంతో రిజర్వుడ్ వర్గాల పిల్లలు నష్టపోవాల్సి వచ్చేది. తొలి దశ అనంతరం మిగిలిన సీట్లకు మలివిడత ఆన్లైన్ ప్రవేశాలుంటాయి. గతేడాది మొత్తం 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా అంతేస్థాయిలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం. విద్యార్థుల మేలుకే ఆన్లైన్ సేవలు గతంలో కొన్ని కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ముఖ్యంగా కరోనా సమయంలో పిల్లలు కాలేజీల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ–హాల్‌టికెట్లను బోర్డు ప్రవేశపెట్టింది. బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించాం. పరీక్ష ఫీజుల విషయంలోనూ కాలేజీలు విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసేవి. దీంతో ఆన్లైన్లో చెల్లించే ఏర్పాటు చేయడంతో కార్పొరేట్ కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అలాగే విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల(టీసీ) విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో నేరుగా బోర్డు నుంచి ఈ–టీసీ జారీ చేసే ప్రక్రియపై దృష్టి సారించాం. దీని ద్వారా విద్యార్థులు నేరుగా బోర్డు వెబ్సైట్ నుంచి టీసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
అధిక ఫీజలు: ఆ స్కూళ్లపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖకు అధికారులు నివేదిక సమర్పించారు. జీవో 46కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కూళ్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. పాఠశాలల అనుమతులు రద్దు చేస్తే వచ్చే ఇబ్బందులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మణికొండలోని మౌంట్ లిటేరాజ్ స్కూల్, బంజారాహిల్స్‌లోని మెరీడియన్ స్కూల్, హిమాయత్‌నగర్‌లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, అమీర్‌పేట్‌లోని నీరజ్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్, డీడీ కాలనీలోని నారాయణ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్స్‌పై అధికారులు నివేదిక ఇచ్చారు. -
అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు : మంత్రి సురేష్
-
కార్పొరేట్ దోపిడీపై అధికారుల కొరడా
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై అధికారులు స్పందించారు. మానవత్వాన్ని మరచి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కొరడా ఝళిపించారు. రెండు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ కోవిడ్ వైద్యానికి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సోమవారం జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో సబ్–కలెక్టర్ హెచ్ఎం.ధ్యానచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత సన్‌రైజ్ ఆస్పత్రికి వెళ్లగా, అప్పుడే అక్కడ మరణించిన కోవిడ్ రోగి బంధువులు నిరసన తెలియజేస్తున్నారు. వారి నుంచి జేసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. వైద్యం పొందుతున్న రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో సన్‌రైజ్ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు, అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి మాత్రం చికిత్స కొనసాగించాలని ఆదేశించారు. అనంతరం చుట్టుగుంటలోని అనీల్ న్యూరో అండ్ ట్రామా ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ వైద్యం చేసేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 17న దరఖాస్తు చేసుకుని, అనుమతి రాకుండానే.. అదే రోజు 12 మంది కోవిడ్ రోగులను అడ్మిట్ చేసుకున్నారని నిర్ధారించారు. ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రూ.2 లక్షల జరిమానా విధించారు. జీవో నం.77 ప్రకారం వైద్యం చేయాల్సిందే.. జిల్లాలోని కోవిడ్ వైద్యానికి అనుమతులు పొందిన ఆస్పత్రుల్లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.77 ప్రకారం ఫీజులు తీసుకుని వైద్యం చేయాల్సిందేనని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ తేల్చి చెప్పారు. అలా కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసినా, ఫిర్యాదు అందినా.. సుమోటోగా చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే 104కు గానీ, 1902కు గానీ ఫోన్ చేయాలని శివశంకర్ సూచించారు. -
అధిక ఫీజులు వసూలు చేస్తే గుర్తింపు రద్దు
సాక్షి, అమరావతి: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసే కాలేజీల గుర్తింపు రద్దు తప్పదని రాష్ట్ర పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వేర్వేరు పేర్లతో ఫీజులు వసూలు చేయడమే కాకుండా విద్యార్థులను ఇబ్బందికి గురిచేయడం నేరమని, అలాంటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన కమిషన్ వైస్ చైర్పర్సన్ విజయశారదారెడ్డి, సభ్యులతో కలసి మీడియాతో మాట్లాడారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత ఏడాది ఫీజులో 30 శాతం మేర కుదించి తక్కిన ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిదన్నారు. అయితే అనేక కాలేజీలు ట్యూషన్ ఫీజును పెంచేసి, ఆపై 30 శాతం తగ్గిస్తున్నట్లు చూపడం, ఇతరేతర పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని చెప్పారు. కరోనా కాలంలో, ఇటీవల కమిషన్.. దాదాపు 360 స్కూళ్లు, కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిందని తెలిపారు. తనిఖీల్లో అధిక ఫీజులతో పాటు అనేక లోపాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. 25 స్కూళ్లు, 50 కాలేజీలపై చర్యలకు సిఫార్సు చేశామన్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కు ఇవ్వని పక్షంలో తీవ్రమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాలేజీల గుర్తింపు రద్దుతో పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా వారి కోసం ఇతర కాలేజీల్లో సీట్లు పెంచేలా చూస్తామని, తల్లిదండ్రులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే చెల్లించేలా నిర్ణయం తీసుకుంటే ఇది మరింత సులువు అవుతుందని చెప్పారు. ఫీజులు ఫిక్స్ చేసి, వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. కొన్ని కాలేజీలు ఫీజు బకాయి పేరిట సర్టిఫికెట్లు ఇవ్వక పోవడం నేరం అని, అలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాట్లాడుతున్న జస్టిస్ కాంతారావు కొన్ని విద్యా సంస్థల్లో భయంకరమైన పరిస్థితులు తమ తనిఖీల్లో పలు కాలేజీల్లో భయంకరమైన పరిస్థితులను గమనించామని, పశువుల కొట్టాలకన్నా అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని వైస్ చైర్పర్సన్ విజయశారదా రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చి ఇలాంటి కాలేజీలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కొన్ని విద్యా సంస్థల్లో ట్యూషన్ ఫీజుతో పాటు కోచింగ్, హాస్టల్, బుక్స్, లాంగ్‌టర్మ్, లైబ్రరీ ఇలా వేర్వేరు పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. కొన్ని కాలేజీలు ఏడాదికి రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా, కొన్నింటిలో రెండేళ్లకు కలిపి ఒకేసారి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. పలు కాలేజీల్లో తనిఖీల సమయంలో రికార్డులు, అకౌంటు పుస్తకాలు చూపించడం లేదని, ఇకపై కమిటీ తనిఖీల సమయంలో అకౌంటెంట్లను కాలేజీల్లో అందుబాటులో ఉంచాలని ఆమె స్పష్టం చేశారు. ఆ కాలేజీల్లో పిల్లల పరిస్థితి దయనీయం ‘శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి కాలేజీల్లో తనిఖీలు చేపట్టాం. పిల్లలను తరగతి గదుల్లో రోజూ 12 గంటలు ఉంచుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించడం లేదు. తల్లిదండ్రులు, విద్యార్థులు తమ సమస్యలను కమిషన్ గ్రీవెన్స్ నంబర్ 9150281111కు తెలపవచ్చు. వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం’ అని కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ నారాయణరెడ్డి తెలిపారు. మరో సభ్యుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ ఐఐటీ, జేఈఈ, నీట్ అంటూ తప్పుడు ప్రకటనలతో కాలేజీలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయన్నారు. ఇలాంటి కోచింగ్‌లకు కాలేజీలకు ఇంటర్ బోర్డు ఎలాంటి అనుమతులు ఇవ్వదని చెప్పారు. కేవలం కోర్సులు మాత్రమే నిర్వహించాలని, ఈ కోచింగ్‌ల పేరిట లక్షల్లో ఫీజులు వసూలు చేయడం నేరం అని.. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరో సభ్యుడు అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘కొన్నింటిలో ఒకేసారి రెండేళ్లకు కలిపి రూ.5 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నారు. గత ఏడాది కన్నా రెట్టింపు ఫీజులను వసూలు చేస్తున్నారు.’ అని తెలిపారు. సభ్యుడు ఏవీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ కాలేజీల్లో పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. కనీసం మూత్ర విసర్జనకు కూడా వెళ్లనీయకుండా మక్కీకి మక్కీ బట్టీ పట్టిస్తున్నారు. పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది.’ అన్నారు. -
డబ్బుంటేనే డాక్టర్ గిరి?
ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వం భర్తీ చేసే సీట్ల ఫీజు రూ.60 వేలు. అదే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్ల ఫీజు రూ.11.55 లక్షలు. అదే సీ(ఎన్ఆర్ఐ) కేటగిరీ ఫీజు రూ. 23.10 లక్షలు. ఇప్పుడు వీటినే ప్రధానంగా మార్చనున్నారు.ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు పేదలకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపశమనంగా ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020–21 వైద్య విద్యా సంవత్సరంలోనే ఈ ఫీజుల భారాన్ని వైద్య విద్యార్థులపై పడేసేలా కేం ద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టం అమలుపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఫీజుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఎంసీఐ స్థానంలో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బోగ్)ను కేంద్రం తాజాగా ఆదేశించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజును కాలేజీ యాజమాన్యాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేస్తారు. మిగి లిన 50% కన్వీనర్ కోటా ఫీజులను కేంద్రం నిర్ధారించనుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ‘బోగ్’ఫీజులపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. వారి సలహాలను కోరింది. ఎంఎన్సీ చట్టం వల్ల అత్యంత తక్కువగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఫీజులు మరింత పెరుగుతాయి. యాజమాన్య సీట్ల ఫీజులూ ఇష్టారాజ్యంగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్ఎంసీ బిల్లుపై మొదట్లో జూనియర్ డాక్టర్లు (జూడా) రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కానీ సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పేద విద్యార్థులపై పిడుగు... తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,500 వరకు కన్వీనర్ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల ఫీజు ఏడాదికి రూ. 10 వేలుకాగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను కూడా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. వాటి ఫీజును రూ. 60 వేలుగా ప్రభుత్వం నిర్ధారించింది. ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు పేదలకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపశమనంగా ఉన్నాయి. అదే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 35 శాతంగా ఉన్న బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ల ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుగా ఉండగా సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ. 23.10 లక్షలుగా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను ఎంఎన్సీ నియంత్రిస్తుంది. వాటినే ఇప్పుడు ప్రధానంగా మార్చనున్నారు. ప్రస్తుతం ఈ ఫీజులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లోని అన్ని ఎంబీబీఎస్ సీట్లకు ఒకటే ఫీజు ఉంది. దేశవ్యాప్తంగా ఒక్కో డీమ్డ్ వర్సిటీలో ఫీజులు మన రాష్ట్రంలోని బీ కేటగిరీ ఫీజులకు దగ్గరగా ఉంటాయి. వాటిని క్రమబద్ధీకరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయా ఫీజులను రూ. 6–7 లక్షల వరకు క్రమబద్ధీకరిస్తారని సమాచారం. అవే ఫీజులను ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఖరారు చేస్తారని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. గందరగోళం నెలకొంది... ఎన్ఎంసీ చట్టం నేపథ్యంలో ఫీజులపై ఇప్పుడు కసరత్తు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్ఎంసీ చట్టం ప్రకారం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్ల ఫీజును ‘బోగ్’నిర్ధారించనుంది. మిగిలిన 50 శాతం సీట్ల ఫీజును ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదించి యాజమాన్యాలు నిర్ధారించుకునే అవకాశముంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజును ఇప్పుడు ఏ మేరకు నిర్ధారిస్తారన్న దానిపై గందరగోళం నెలకొంది. ఫీజుల పెంపుపై మాకు ఇప్పటివరకు సమాచారం రాలేదు. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పెంచితే పెనుభారమే... డీమ్డ్ వర్సిటీలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను పెంచితే అది పేద విద్యార్థులకు పెనుభారమే కానుంది. ఫీజులు పెంచుతారన్న ఆందోళనైతే ఇప్పటికీ నెలకొని ఉంది. ఎన్ఎంసీ బిల్లు వచ్చిన సమయంలో ఫీజులు పెరుగుతాయని ఉద్యమాలు చేశాం. అయినా బిల్లు చట్టంగా రూపుదిద్దుకుంది. - డాక్టర్ విజయేందర్, సలహాదారు, జూడాల సంఘం -
ఫీజుల నియంత్రణ.. ఓ పదేళ్ల పాత మాట
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మంచి పేరున్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వార్షిక ఫీజు రూ.78 వేలు మాత్రమే. ఇక సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే కనీస వార్షిక ఫీజు రూ.35 వేలే. అదే నగరంలోని ఆ కాలేజీకి రెండు కిలోమీటర్ల పరిధిలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థి వార్షిక ఫీజు రూ.85 వేలు. అంటే ఇంజనీరింగ్ కంటే పదో తరగతి చదివే విద్యార్థి ఫీజే ఎక్కువ. పోనీ విద్యార్థులకు సదుపాయాలు, టీచర్ల వేతనాల విషయంలో ఇంజనీరింగ్ కాలేజీకంటే ఎక్కువగానే కల్పిస్తున్నారా? అంటే అదీ చెప్పలేని పరిస్థితే. కనీసం స్కూల్లోని విద్యా ర్థులందరికీ నాణ్యమైన విద్య అందుతోందా? అంటే అదీ లేదు. మొన్నటి పదో తరగతి పరీక్షల్లో ఆ స్కూల్‌కు చెందిన చాలామంది విద్యార్థులు ఫెయిలయ్యారు. అందులో శ్రీవర్ధన్ అనే విద్యార్థి ఉన్నాడు. అతని తండ్రి రాజేందర్‌రెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగి. వరంగల్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన తన కొడుకును కార్పొరేట్ స్కూల్లో చేర్చాడు. అప్పులు చేసి మరీ చదివించినా ఫలితం లేకుండా పోయింది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇలా అనేకమంది తండ్రులు తమ పిల్లలను బాగా చది వించాలన్న తపనతో కార్పొరేట్, పేరున్న ప్రైవేటు స్కూళ్లలో చేర్చి ఆర్థికంగా అప్పులపాలు అవుతున్నారు. రాష్ట్రంలో 10,526 ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 30,77,884 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 3,487 కార్పొరేట్, టాప్ పాఠశాలలు ఐఐటీ, ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి 62 రకరకాల పేర్లతో రూ.లక్షల్లో కేపిటేషన్ ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. చివరకు నర్సరీ నుంచే ఐఏఎస్ పాఠాలు? అంటూ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ తంతు ఏళ్ల తరబడి కొనసాగింది.. కొనసాగు తూనే ఉంది. ఎలాంటి శాస్త్రీయత లేకుండానే ఫీజులు వసూలు చేస్తున్నా స్కూల్ ఫీజుల నియంత్రణ ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. 25 శాతం ఫీజుల పెంపు.. ప్రభుత్వం వద్దన్నా రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు ఈసారి 25% వరకు ఫీజులను పెంచే శాయి. అయినా ఫీజుల నియంత్రణ రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే కోర్టు కేసులు.. ఆ తర్వాత ఇష్టారాజ్యంగా పెంపు ఏటా ఇదే తంతు. పోనీ ఆ ఫీజుల వసూలు, పెంపులో ఏమైనా శాస్త్రీయత ఉంటుందా? అంటే అదీ లేదు. యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతున్నా అడ్డుకట్ట పడక తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలను బాగా చదివించాలన్న ఆశలతో అప్పులు చేసి మరీ ఫీజులను చెల్లించక తప్పడం లేదు. శాస్త్రీయత ఎక్కడ..? ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కాదు.. వాటి ఖరారులోనే శాస్త్రీయ విధానం లేదు. ప్రభుత్వాలు గత పదేళ్లుగా అనేక చర్యలు చేపట్టినా న్యాయ వివాదాల్లోనే అవన్నీ చిక్కుకున్నాయి. ఫీజులను కట్టడి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నా అధికారులు దానిని పక్కాగా చేపట్టేలా చేయడంలో విఫలం అవుతున్నారు. ఫలితంగా పలు సందర్భాల్లో వృత్తి విద్యా కాలేజీల తరహాలో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలల ఫీజులను నియంత్రించాలని, యాజమాన్యాల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేయాలనే ఆలోచన చేసినా, వాటిని పకడ్బందీగా చేయడంలో విఫలం కావడంతో ఆ ఉత్తర్వులు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో.. రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణ ఒక్కోసారి ఒక్కో కారణంతో ఆగిపోతోంది. 2009లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో 91, 92లను జారీ చేసింది. దాని ప్రకారం జిల్లా స్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలని పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్టంగా రూ.24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.30 వేలు ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆ ఉత్తర్వులపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. డీఎఫ్ఆర్సీల ఏర్పాటు సరిగ్గా లేదని, జిల్లా స్థాయిలో ఫీజుల ఖరారు కుదరదని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం జీవో 41, 42లను జారీ చేసింది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వసూలు చేయాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800లకు మించి వసూలు చేయవద్దని పేర్కొంది. అయితే ఆ జీవోపైనా 2016లో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో వాటి అమలు ఆగిపోయింది. హైకోర్టులో పిల్.. ఆపై కమిటీ.. 2016లో ఫీజుల నియంత్రణపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విద్యాశాఖ ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి విద్యాశాఖ పంపించింది. ఆ తర్వాత ప్రభుత్వం మాజీ వైస్ చాన్స్‌లర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని 2017 మార్చిలో నియమించింది. ఆ కమిటీ కూడా పలు సిఫారసులు చేసింది. ప్రైవేటు స్కూళ్లు ఏటా ఫీజులను 10 శాతంలోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ నివేదించడంతో ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది. దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఫీజులను పెంచవద్దని 2018 ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఫీజుల నియంత్రణ ఆగిపోయింది. ఆదాయ వ్యయాలను బట్టి నిర్ణయించేలా? ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలు ఇష్టారాజ్యంగా కాకుండా పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించే వ్యవస్థను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే ఫీజుల నిర్ణయం, వసూళ్లలో శాస్త్రీయత ఉంటుందని, ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులు నిర్ణయిస్తే భారం కూడా తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నారు. -
దోపిడీ అరికట్టండి
స్కూళ్లకు షోకాజ్ నోటీసులివ్వండి ప్రాథమిక విద్యా శాఖకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశం ‘సాక్షి’ కథ నంతో సుమోటోగా కేసు సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న వైనంపై ‘ఫీ ‘జులుం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం చదివి, చలించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్.. ప్రైవేటు స్కూళ్ల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాక సుమోటోగా కేసు స్వీకరించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ప్రాథమిక విద్యాశాఖ డెరైక్టర్‌కు సూచించింది. అధిక ఫీజుల వసూళ్లను కట్టడి చేయాలని... ఈమేరకు తెలంగాణ జిల్లాల్లోని డీఈఓలను ఆదేశించాలని స్పష్టం చేసింది. కథనం ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణలో చేపట్టి... విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలంది. లేకుంటే నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు చదువు భారమవుతుందని.. ఆ పరిస్థితి రానివ్వద్దని సూచించింది. న్యాయవాదిని నియమించండి మరో పక్క హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) కూడా అధిక ఫీజులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే రీతిలో ఫీజులు ఉంటే భవిష్యత్‌లో చదువంటేనే భయపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘విద్యా హక్కు చట్టం, విద్యాశాఖ నిబంధనలను గాలికి వదిలి కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు అధిక మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నాయి. స్కూళ్ల అభివృద్ధి జరగాలి. కానీ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకూడదు. హైకోర్టు కూడా ఈ విషయంలో స్పష్టంగా తీర్పు చెప్పింది. అన్ని ధరలు పెరిగాయన్న సాకుతో ఏకబిగిన ఫీజులు వసూలు చేయకూడదు. ఏటా స్వలంగా పెంచుకోవాలే తప్ప ఒకేసారి తల్లిదండ్రులపై భారాన్ని మోపకూడదు. ఫీజుల రూపంలో దోపిడీ తీరును గతంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం. అయినా స్పందన రాలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా వినతిపత్రం అందజేశాం. ఫీజుల దోపిడీ అడ్డుకుంటామని ప్రభుత్వం సూత్రప్రాయంగా చెప్పింది. జీఓ 42పై ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. దీనిపై వాదించడానికి ప్రభుత్వం తరఫున లాయర్‌ను నియమించాల్సిన అవసరం ఉంది’ అని హెచ్ఎస్పీఏ జనరల్ సెక్రటరీ రవికుమార్ కోరారు. -
ఇక ఫీజులపై సమరం
అధిక ఫీజుల వసూలు చేస్తే క్రిమినల్ కేసులు యాజమాన్యాలతో పోరుకు పేరెంట్స్ నుంచి మద్దతు తల్లిదండ్రులతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సమావేశం సాక్షి, సిటీబ్యూరో: గుర్తింపులేని పాఠశాలలపై కొరడా ఝుళిపించిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం తాజాగా అధిక ఫీజులపై సమరానికి సన్నద్ధమైంది. ఫీజుల నియంత్రణ చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ.. ఆయా పాఠశాలల్లో అదనపు వసూళ్లపై జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా దృష్టిసారించారు. ఒకవైపు ప్రైవేటు యాజమాన్యాల పిటిషన్‌పై హైకోర్టులో అప్పీల్‌కు సిద్ధమవుతూనే, మరోవైపు పాఠశాలల గుర్తింపునకు సంబంధించిన జీవోలోని వివిధ అంశాల అమల్లో కఠిన వైఖరిని అవలంభించాలని జిల్లా విద్యాశాఖకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలన్నీ నిబంధనలకు లోబడే పనిచేయాలని, యాజమాన్యాలు ప్రకటించిన ఫీజుల కంటే అదనంగా ఒక్కరూపాయి వసూలు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేసి, పాఠ శాలల గుర్తింపు రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఫీజుల దోపిడీపై తీసుకుంటున్న చర్యలకు తల్లిదండ్రుల నుంచి మద్దతు కావాలని కలెక్టర్ కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అంశంపై శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులతో కలెక్టర్, డీఈవో సమావేశమయ్యారు. స్కూళ్లకు సంబంధించి వివిధ అంశాలపై తల్లిదండ్రులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగునకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలన్నీ ప్రభుత్వ ఉత్తర్వులను, చట్టాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనన్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజు మినహా ఎటువంటి(డొనేషన్, అడ్మిషన్ పీజు, బిల్డింగ్ ఫండ్.. వగైరా)కాపిటేషన్ ఫీజు తీసుకోరాదన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు నగరంలోని 2100 ప్రైవేటు పాఠశాలల్లో 1800 పాఠశాలల యాజమాన్యాలు తాము వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సమర్పించాయన్నారు. వారు ప్రకటించిన ఫీజులకు కట్టుబడి ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు. యాజమాన్యాలు ప్రకటించిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తే బుక్లెట్ వెనుక ఉన్న ప్రొఫార్మాలో వివరాలను నింపి అక్కడిక్కడే ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదులు నమోదుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాఠశాలల పేర్లలో కాన్సెప్ట్, ఒలంపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ పేర్లను తొలగించాలని ఆదేశించారు. పేరుకే కార్పొరేట్ టెక్నో, కాన్సెప్ట్, ఒలింపియాడ్.. అంటూ గొప్పలు చెబుతున్న కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కువమంది ఇంటర్,డిగ్రీ చదివిన వాళ్లే చదువు చెబుతున్నారు. ప్రతి ఏటా ఇష్టా రాజ్యంగా ఫీజులను పెంచుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో టెన్త్ క్లాస్ ఫీజు ఎంబీబీఎస్ ఫీజును మించిపోతోంది. జిల్లా యంత్రాంగమే దీనిని అరికట్టాలి. -అశ్విన్ ఫిర్యాదులను పట్టించుకుంటారా! కొన్ని పాఠశాలల్లో పదో తరగతికి రూ.70వేల నుంచి రూ. లక్షవరకు ఫీజు వసూలు చేస్తున్నారు. అదనపు ఫీజుల వసూళ్లపై ఫిర్యాదు చేస్తే మా పిల్లలను యాజమాన్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మేము చేసే ఫిర్యాదులపై స్పందిస్తామని హామీ ఇస్తే.. వ్యక్తిగతంగా లేదా సామూహికంగా ఫిర్యాదులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. -రుక్మిణి -
ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు
నిజామాబాద్ అర్బన్ : ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు, నిబంధనల అమలుపై యాజమాన్యాలతో జిల్లా అధికారులు బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఇన్చార్జి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రి య ముగిసి.. ఫీజుల వసూళ్లు పూర్తయి నెల అవుతోంది. ఇన్నిరోజులు స్పందించని అధికారులు ఇప్పుడు సమీక్ష చేపట్టడం నవ్వులాట గా మారింది. ‘‘ప్రైవేటు పాఠశాలలు ప్రభు త్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నా యి.. ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి..’’ అం టూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఈ నెలరోజులుగా ఆందోళనలు వ్యక్తంచేశారు. వీటిపై కనీసం స్పందించని అధికారులు.. నెల గడిచిన తర్వాత స్కూళ్లతో సమావేశం పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అంతా అయ్యాక జిల్లాలో 854 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. జిల్లాకేంద్రంలోనే 180 స్కూళ్లు ఉన్నాయి. ఈ ఏడాది దాదాపు అన్ని పాఠశాలలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేశాయి. డొనేషన్ల కోసం రూ.20 నుంచి రూ.30వేలు, ఫీజుల రూపంలో మరో రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యాహక్కు చట్టాన్ని ఎక్క డా అమలు చేసిన దాఖలాలు లేవు. విద్యార్థు ల ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించడం, అదనపు తరగతి గదులు ఏర్పాటు చేసుకుని అనుమతి లేకుండానే నిర్వహించడం చేస్తున్నాయి. ఎంట్రెన్స్‌లో పాస్‌కాని విద్యార్థులకు అదనంగా ఫీజులను వ సూలు చేశారు. చాలావరకు పాఠశాలలు నోట్‌బుక్కులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను స్కూళ్లలోనే అధిక ధరలకు విక్రయించాయి. మొత్తంగా ఒక్కో విద్యార్థిపై రూ.50వేల వరకు యాజమాన్యాలు వసూలు చేసినట్లు తెలిసింది. ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న పాఠశాలలు సైతం భారీగా ఫీజులు వసూలు చేశాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉచిత ప్రవేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫీజుల వసూలు విషయంలో డీఎఫ్ఆర్సీ నిబంధనలను కనీసం అమలు చేయలేదు. నిపుణులైన ఉపాధ్యాయులు లేకుండానే కొనసాగిస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల గడుస్తున్నా ఇలాంటి పాఠశాలలపై జిల్లా అధికారులు స్పందించలేదు. సమావేశం సమంజసమేనా! పాఠశాలలు ప్రారంభమై నెల దగ్గర పడుతుండగా.. ప్రైవేటు పాఠశాలలతో అధికారులు సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో ఫీజులు కూడా వసూలు చేశారు. నోట్, పాఠ్యపుస్తకాలకు తల్లిదండ్రులు డబ్బులు చెల్లించారు. ఇప్పుడు ఈ సమావేశాలు నిర్వహించడం వల్ల ఏం ప్రయోజనం.. ఎవరికి లాభం అని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపైనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.