నిజామాబాద్ అర్బన్ : ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు, నిబంధనల అమలుపై యాజమాన్యాలతో జిల్లా అధికారులు బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రి య ముగిసి.. ఫీజుల వసూళ్లు పూర్తయి నెల అవుతోంది. ఇన్నిరోజులు స్పందించని అధికారులు ఇప్పుడు సమీక్ష చేపట్టడం నవ్వులాట గా మారింది. ‘‘ప్రైవేటు పాఠశాలలు ప్రభు త్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నా యి.. ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి..’’ అం టూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఈ నెలరోజులుగా ఆందోళనలు వ్యక్తంచేశారు. వీటిపై కనీసం స్పందించని అధికారులు.. నెల గడిచిన తర్వాత స్కూళ్లతో సమావేశం పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
అంతా అయ్యాక
జిల్లాలో 854 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. జిల్లాకేంద్రంలోనే 180 స్కూళ్లు ఉన్నాయి. ఈ ఏడాది దాదాపు అన్ని పాఠశాలలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేశాయి. డొనేషన్ల కోసం రూ.20 నుంచి రూ.30వేలు, ఫీజుల రూపంలో మరో రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యాహక్కు చట్టాన్ని ఎక్క డా అమలు చేసిన దాఖలాలు లేవు. విద్యార్థు ల ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించడం, అదనపు తరగతి గదులు ఏర్పాటు చేసుకుని అనుమతి లేకుండానే నిర్వహించడం చేస్తున్నాయి. ఎంట్రెన్స్‌లో పాస్‌కాని విద్యార్థులకు అదనంగా ఫీజులను వ సూలు చేశారు.
చాలావరకు పాఠశాలలు నోట్‌బుక్కులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను స్కూళ్లలోనే అధిక ధరలకు విక్రయించాయి. మొత్తంగా ఒక్కో విద్యార్థిపై రూ.50వేల వరకు యాజమాన్యాలు వసూలు చేసినట్లు తెలిసింది. ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న పాఠశాలలు సైతం భారీగా ఫీజులు వసూలు చేశాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉచిత ప్రవేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫీజుల వసూలు విషయంలో డీఎఫ్‌ఆర్‌సీ నిబంధనలను కనీసం అమలు చేయలేదు. నిపుణులైన ఉపాధ్యాయులు లేకుండానే కొనసాగిస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల గడుస్తున్నా ఇలాంటి పాఠశాలలపై జిల్లా అధికారులు స్పందించలేదు.
సమావేశం సమంజసమేనా!
పాఠశాలలు ప్రారంభమై నెల దగ్గర పడుతుండగా.. ప్రైవేటు పాఠశాలలతో అధికారులు సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో ఫీజులు కూడా వసూలు చేశారు. నోట్, పాఠ్యపుస్తకాలకు తల్లిదండ్రులు డబ్బులు చెల్లించారు. ఇప్పుడు ఈ సమావేశాలు నిర్వహించడం వల్ల ఏం ప్రయోజనం.. ఎవరికి లాభం అని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపైనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు
Published Wed, Jul 2 2014 5:27 AM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM
Advertisement
Advertisement