సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ వేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకూ అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్ కోసం ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ ఆస్పత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కాగా, పది రోజుల విరామం తర్వాత ఈ రోజు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వ్యాక్సి నేషన్ కేంద్రాల వద్ద రెండవ డోసు కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం కేంద్రాలు ప్రారంభం కంటే ముందే తరలి వచ్చారు. కొందరికి నిర్దిష్ఠ సమయం పూర్తి కావటంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మళ్ళీ వ్యాక్సిన్ వేస్తుండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇకపై వ్యాక్సిన్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చదవండి: తిన్నది అరగడం లేదు సార్..అందుకే బయటకు వచ్చా..
లాక్‌డౌన్: అమ్మలా.. ఆకలి తీరుస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment