హైదరాబాద్: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చర్చలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఎన్ఎంయూ నేతలు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ మంత్రులు నాయిని, ఈటెలను టీఎన్ఎంయూ నేతలు కలసిశారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న కార్మికులపై ఎండీ అనుసరిస్తున్న వైఖరిని వారు ఈ సందర్భంగా మంత్రుల ఎదుట దుయ్యబట్టారు.
అనంతరం రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి వద్దకు కార్మిక సంఘాల నేతలు చర్చలకు వెళ్లారు. అయితే కోర్టు తీర్పును గౌరవించి సమ్మెను విరమించాలని రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి కార్మిక సంఘా నేతలకు విజ్ఞప్తి చేశారు. అప్పుడే చర్చలు జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 12న ప్రభుత్వ వాదనలు కోర్టులో వినిపిస్తామని మహేందర్రెడ్డి వెల్లడించారు.