కార్మికులు సమ్మె విరమించకుంటే కఠిన చర్యలు: ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్ : కార్మికులు గురువారం మధ్యాహ్నంలోపు సమ్మె విరమించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు హెచ్చరించారు. ఎల్లుండి జరగనున్న ఎంసెట్ ప్రవేశ పరీక్ష నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 10700 బస్సు సర్వీసులకు 350 బస్సులు... ఆంధ్రప్రదేశ్లో 11282 సర్వీసులకు 1218 బస్సులు తిరుగుతున్నాయని వివరించారు. 333 మంది డ్రైవర్లలో 150 మంది విధులకు హాజరయినట్లు చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులు రేపటిలోగా విధులకు హాజరైతే వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు.