దక్షిణాదిలో అత్యంత రద్దీ నగరంగా పేరొందిన బెంగళూరు ఖరీదైన ఇంటి అద్దెలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యువకులకు, ముఖ్యంగా బ్యాచిలర్లకు ఇళ్లు, ఫ్లాట్లు దొరకడం కష్టం. అద్దెకు వచ్చే వారి నేపథ్యం, అకడమిక్ మార్కుల ఆధారంగా కూడా ఇల్లు ఇస్తున్న సంఘటనలు ఇక్కడ కొత్తేమీ కాదు.
మెట్రో నగరంలో అద్దె ఇళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రియమ్ సారస్వత్ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు విభిన్నమైన ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. బెంగళూరులోని తన ఇంటిని అద్దెకు ఇస్తున్న ఆయన "బ్యాచిలర్స్, లివ్-ఇన్ కపుల్స్" కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
వూష్ కో ఫౌండర్ ప్రియమ్ సారస్వత్ ఈ మేరకు తన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. బెంగళూరులోని హర్లూర్ రోడ్డులో కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిని హోమ్ టూర్ చేశారు. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌కు సమీపంలో ఉంది. "నేను హర్లూర్ రోడ్‌లో (హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌కు చాలా దగ్గరగా) లో ఈ అందమైన ఇంటిని కొనుగోలు చేశాను. ఇందులో అద్దెకు ఉండేవారి కోసం చూస్తున్నాను. బ్యాచిలర్స్ లేదా లివ్-ఇన్ జంటలకు ప్రాధాన్యం ఉంటుంది" అని ఆయన ‘ఎక్స్’లో రాసుకొచ్చారు.
I purchased this beautiful house at Harlur Road (Very close to HSR Layout) and now looking for tenants to occupy asap 🏡😇
Bachelors or Live-In couples preferred ( My way of giving back to the community 😉)
Dm if you are interested and RT for good karma ✌️ pic.twitter.com/d7pcC53GI8— Priyam Saraswat (@priyamsaraswat) June 13, 2024
Comments
Please login to add a commentAdd a comment