
ఈ అరుదైన జీవి సీతాకోకచిలుక జాతుల్లోకెల్లా పెద్దది.
సాక్షి, మక్కువ: ఓ సరికొత్త రూపం.. మూడు వైపులా తలలున్నట్టుగా ఆకారం.. అరచేతికన్నా పెద్దగా కనిపిస్తున్న ఈ అరుదైన జీవి సీతాకోకచిలుక జాతుల్లోకెల్లా పెద్దది. దీనిని అట్లాస్‌మాత్ అని పిలుస్తారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం దుగ్గేరు గ్రామంలోని ఓ చెట్టు కొమ్మపై ఇది దర్శనమిచ్చింది. చూడ్డానికి చాలా అందంగా ఉన్న దీని శాస్త్రీయ నామం అట్టాకస్ అట్లాస్. శాతమిల్లేడ్ కుటుంబానికి చెందిన ఈ సీతాకోకచిలుక రాత్రిపూట మెరుస్తుందని, అందుకే దీనిని మిస్ యువరాణిగా అభివర్ణిస్తారని వ్యవసాయాధికారి తిరుపతిరావు చెప్పారు.