తూనీగలా రివ్వున ఎగిరే అమ్మాయి ఒక్కసారిగా ఒద్దిగ్గా సీతాకోక చిలుకలా కనిపిస్తే ఎంత కనువిందుగా ఉంటుంది! రోజూ రోజాలా విలాసంగా వికసించే యువతి ఏ ప్రభాతంలోనో ముద్దమందారంలా ప్రత్యక్షమైతే ఎంత మనోహరంగా ఉంటుంది! నిత్యం మోడర్న్ లుక్స్‌తో సెలయేరులాతుళ్లిపడే టీనేజైఉ గాళైఉ ఒక్కసారిగా కళ్లు చెదిరేట్టు లంగా వోణీలో కళకళలాడితే ఎంత మార్వెలెస్‌గాఉంటుంది! ఇలాటప్పుడే ‘అమ్మో.. బాపుగారి బొమ్మో’ అని పాడబుద్ధేస్తుంది. అయితే ఏ దసరా వంటి పండగ సందడి వస్తేనే ఈ సోయగాలు చూడడం సాధ్యమవుతుంది. రోజూ పండగ వస్తే బాగుణ్ననుకుంటున్నారా? సారీ.. పర్వదినాన ఏ కోవెల ఆవరణలోనో, వీధి వాకిట్లోనో పట్టు పరికిణీని చూసినప్పుడు కలిగే సంతోషం... స్కూటీ మీద కాలేజీకో, ఉద్యోగాలకో పరుగులు తీస్తూ ఉన్నప్పుడు ఎలా కలుగుతుంది? అందుకే పండగొస్తేనే పట్టు పరికిణీల రెపరెపల్లో సోయగమేంటో అందరికీ తెలిసేది.
ఉద్యోగాలనండి, చదువులనండి.. ఇప్పటి కాలం అమ్మాయిలు కంఫర్ట్‌కే ఓటేస్తున్నారన్నది వాస్తవం. బస్సెక్కాలన్నా, బండి నడపాలన్నా పరికిణీ, వోణీల్లో ఏం సాధ్యమవుతుంది? పరుగులు తీయాలంటే అదో ప్రతిబంధకమవుతుంది. అందుకే ఎక్కువ మంది ప్యాంటైఉ్స, చుడీదార్స్‌తో ఈజీనెస్‌ను వెతుక్కుంటున్నారు. అయితే పండగ నాడు మాత్రం ఈ మోడర్న్ ట్రెండ్స్ ఒక్కసారిగా మాయమవుతాయి. పక్కా ట్రెడిషనలైఉ డ్రెస్‌లు ప్రత్యక్షమవుతాయి. అయితే ఇందులోనూ మళ్లీ మోడర్న్ ట్రెండ్‌లు రాజ్యమేలుతున్నాయి. పూర్వకాలంలో మాదిరిగా పట్టు చీరలు పరికిణీలుగా మారిపోయే రోజులు కావివి.. స్పెషల్ డిజైనర్ల ఆలోచనల్లోనుంచి పుట్టే కొత్త డిజైనర్లతో... ఇప్పటి తరాన్ని మెప్పించే ట్రెండీ ఫ్యాషన్‌లతో ట్రెడిషలన్ డ్రెస్సులు మెరుపులీనుతున్నాయి.
ఎంత తేడా!
అమ్మదో, అమ్మమ్మదో పట్టుచీర రూపాన్ని మార్చుకుని అమ్మాయి పట్టు పరికిణీ, లంగాగా అవతరిస్తుంది.. ఇది పాత మాట. డిజైనర్ల సృజన నకారణంగా పట్టు వస్త్రం రకరకాల హొయలు పోయి, భిన్నమైన సోయగాలను సంతరించుకుని, కొత్త తళుకులు అద్దుకుని లెహంగాగా అవతరించడం కొత్త బాట. టేస్ట్‌ను బట్టి, బడ్జెట్‌ను బట్టి లంగా, వోణీ డిజైనర్ల చేతుల్లో అనేక రీతుల్లో హరివిల్లులా మారుతోంది. ప్యూర్ రా మెటీరియల్స్‌ను బయిట నుంచి తెచ్చి, కలర్స్‌తో డై చేసి కుందన్ వర్క్, కట్ వర్క్‌తో మెరుగులు దిద్దితే ట్రెండీ ట్రెడిషనల్ డ్రెస్ తయారవుతోంది. బనారస్ కావొచ్చు.. జైపూర్ కావచ్చు.. ఏపట్టయినా, జార్జెట్ అయినా, ప్యూర్ సిల్క్స్ అయినా భిన్నంగా డిజైన్ చేసి వెరైటీగా స్టిచ్ చేస్తున్నారు. అన్ని వర్గాల అమ్మాయిలకు అందుబాటులో ఉండేట్టు ఆర్డర్ మీద సిద్ధం చేస్తున్నారు. ఈ లెహంగాస్ రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఉన్నాయి. చీరలు రూ. 5 వేల నుంచి లక్ష వరకూ ఉన్నాయి.! డిజైన్ బట్టి ధర లుంటాయని డిజైనర్లు అంటున్నారు.
అన్ని ఫంక్షన్లకూ..
సందర్భం ఏదైనా.. ఎక్కడైనా డిజైనర్ లెహంగాలు, చీరలు ఇప్పుడు స్టార్ ఎట్రాక్షన్‌గా ఉన్నాయి. రెడీమేడ్ స్టాక్ కూడా లభ్యమవుతున్నాయి. వీటి ధర కాస్త తక్కువగా ఉంటుంది. ట్రెండీగా ఉండడంతో యూత్ వీటిని బాగా లైక్ చేస్తున్నారు. ట్రెండీగా కనిపించే చీరల్లో, పరికిణీల్లో కళ్లు చెదిరేట్టు కనిపిస్తున్నారు. అమ్మాయిలూ ఇంకెందుకు ఆలస్యం.. దీపావళికి ట్రెండీ ట్రెడిషనలైఉ డ్రెస్‌లను ట్రై చేస్తారా?
అదిరే.. అదిరే!
Published Sat, Oct 4 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement
Advertisement