చంద్రబాబు.. సీతాకోకచిలుక..
విజయవాడ: దేశంలో జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. ఆర్జీ ఇచ్చుకునేందుకో, గోడు వెళ్లబోసుకునేందుకో సామాన్యులెవరైనా సీఎం సార్ ని కలవాలంటే సవాలక్ష సెక్యూరిటీ చెకింగ్ లు. వీవీఐపీగా ఆ ప్రక్రియ తప్పనిదే. అలాంటిది శనివారం విజయవాడ నగరంలో దుర్గగుడి ఫ్లై ఓవర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను భద్రతా వలయాలను ఛేదించుకునిమరీ ఓ కీటక శ్రేష్ఠం పలకరించింది.
నేరుగా చంద్రబాబు తలపై వాలిన సీతాకోకచిలుక.. నిమిషాలపాటు అక్కడే ఉండిపోయింది. బాబుగారు కూడా దానిని అదిలించే ప్రయత్నం చేయలేదు. ఇది గమనించిన సీఎం బాడీగార్డ్.. సీతాకోకచిలుకను నేర్పుగా ఒడిసిపట్టి గాలిలోకి వదిలేశారు. ఈ దృశ్యాలను సీఎం పక్కనే కూర్చున్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సుజనా చౌదరిలు ఆసక్తిగా గమనించారు.