చెంపలపై...బటర్‌ఫ్లై
మెడిక్షనరీ
ముక్కుకు ఇరువైపులా చెంపల మీద సీతాకోకచిలుక ఆకృతిలో కనిపించే చర్మం మీద కనిపించే మచ్చల వల్ల ఈ సమస్యకు ‘బటర్‌ఫ్లై ర్యాష్’ అని పేరు. ల్యూపస్ అనే దీర్ఘకాలిక వ్యాధి వల్ల కనిపించే లక్షణమిది. ఇదొక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన వ్యాధి నిరోధకత మనపైనే దుష్ర్పభావం చూపడం వల్ల ఈ వ్యాధి కనిపిస్తుందన్నమాట.
ఆటో ఇమ్యూన్ వ్యాధి కావడం వల్ల ఇది ఒక పట్టాన తగ్గే అవకాశం అంతగా ఉండదు. కానీ సన్‌స్క్రీన్ లోషన్స్ రాయడం, ఎండవేడిమి వెళ్లకుండా ఉండటం, కొన్ని రకాల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు వాడటం, ‘డీఎమ్‌ఏఆర్‌డీ’స్‌అని పిలిచే డిసీజ్ మాడిఫయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ వాడటం వంటి చికిత్సల వల్ల ఇది కాస్త అదుపులోకి వస్తుంటుంది.