Disease resistance
-
Omicron BF 7: ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్ సోకడం, వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా మన దేశంలో ఇప్పటికే చాలా మందిలో రోగ నిరోధకత వచ్చిందని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్–7 పట్ల ప్రజలు అలజడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉండనుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. చైనాలో అలా ఎందుకంటే? చైనాలో మన కంటే చాలా ముందుగానే టీకాల పంపిణీ చేపట్టినా అన్ని వర్గాలకు పంపిణీ చేయలేదు. వయసు మళ్లిన వారిలో చాలా మందికి టీకాలు వేయలేదు. దీంతో ఎక్కువ మందిలో హైబ్రీడ్ రోగ నిరోధకత లేదు. చాలా ముందే టీకాల పంపిణీ జరిగిన నేపథ్యంలో వాటిని తీసుకున్న వారిలోనూ హైబ్రీడ్ రోగనిరోధకత క్షీణించి ఉంటుంది. జీరో కోవిడ్ పాలసీతో అక్కడ కఠినమైన లాక్డౌన్ విధిస్తూ వచ్చారు. దీంతో సహజసిద్ధమైన రోగ నిరోధకత తక్కువ మందికే ఉంది. తక్కువ మందికి వ్యాక్సినేషన్, ఒక్కసారిగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం లాంటి కారణాలతో చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. వాతావరణం కూడా.. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి వైరస్ల ప్రభావం, కదలికలు ఉంటాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో చలి తీవ్రత ఎక్కువ. వైరస్ వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా ఒక కారణం. ఆయా దేశాల్లో ఏ మేరకు మరణాలు సంభవిస్తున్నాయి? ఆస్పత్రుల్లో ఎంత మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు? అనే అంశాలను బట్టి వైరస్ ప్రభావాన్ని అంచనా వేయాలి. బీఎఫ్–7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారనే వార్తలు మినహా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడి కాలేదు. రెండు మూడు నెలల క్రితమే.. మన దేశంలో బీఎఫ్–7 వేరియంట్ కేసులు రెండు మూడు నెలల కిందటే వెలుగు చూశాయి. అయితే వ్యాప్తి పెద్దగా లేదు. దీని బారిన పడిన వారికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి రోగ నిరోధకత తక్కువగా ఉండే వారిపై ఈ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది. 60 ఏళ్లుపైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకుని చాలా రోజులైన వారు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారు నాలుగో డోస్ టీకా తీసుకోవడం కూడా మంచిదే. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం. అంతర్జాతీయ ప్రయాణాలను విరమించుకోవాలి. జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. -
ఇమ్యూనిటీ డైట్... ఇలా!
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాధి నిరోధకత పెంచుకోవడం ముఖ్యం. అలా పెంచుకోడానికి రోజులో తీసుకోవాల్సిన ఆహారాల తీరుతెన్నుల గురించి సక్షిప్తంగా తెలుసుకుందాం. ఉదయం టిఫిన్‌లో... మనం రోజూ ఉదయం లేవగానే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం కదా. అందుకు ఉపయోగించే ధాన్యాలు పొట్టు తీయనివై ఉండటం మనకు ఎంతో మేలు చేస్తాయి. ఉదాహరణకు చపాతీలు, పూరీల కోసం పొట్టుతీయని గోధుమలు, ఉప్మా కోసం కూడా పొట్టుతీయని గోధుమ రవ్వ వంటివి వాడాలి. పెసరట్ల కోసం కూడా పొట్టు తీయని పెసర్లు వాడటం మేలు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టీ : సాధారణంగా మనలో చాలామందికి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. అలా మనం తాగే టీ జింజర్ టీ అయితే మేలు. అల్లానికి ఓ విచిత్రమైన ఘాటు రుచీ, ఘాటు వాసన (ఫ్లేవర్) ఉంటుందన్నది మనకు తెలిసిన విషయమే. దీనికి కారణం అల్లంలో ఉండే జింజెరాల్ అనే స్వాభావికమైన రసాయనం. దాని వల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జింజెరాల్ అనే ఆ శక్తిమంతమైన పదార్థంలో నొప్పి, వాపు, మంటను తగ్గించే (యాంటీఇన్ఫ్లమేటరీ) గుణంతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం అన్నం పొట్టుతీయని ముడిబియ్యంతో వండిన అన్నం అయితే మంచిది. చపాతీలు అయితే పొట్టుతీయని పిండితో చేసినవి తీసుకోవాలి. ఇక రకరకాల రంగుల్లో ఉండే చాలారకాల కూరగాయలతో చేసిన కూరలను తీసుకోవాలి. కూరలన్నీ దాదాపుగా ఉడికించడం ద్వారా వండినవై ఉండాలి. ఈవినింగ్ శ్నాక్స్ : ఇక సాయంత్రం వేళల్లో వేయించిన పల్లీలు, బాదంపప్పు మంచిది. కొవ్వు లేని పెరుగులో కొన్ని పండ్ల ముక్కలు వేసుకుని తినడం చాలా మంచిది. మొలకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) ఉడికించిన బఠాణీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. రాత్రి భోజనం రాత్రివేళ తినే భోజనంలో నూనెలు వీలైనంత తక్కువగా ఉండాలి. మధ్యాహ్నం లాగే పొట్టు తీయని ముడిబియ్యంతో వండిన అన్నం లేదా పొట్టుతీయని గోధుమపిండితో చేసిన చపాతీలు మంచివి. భోజనానికి ముందర గ్రీన్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇక రాత్రి తినే భోజనంలో ఆకుకూరలు మేలు. నీళ్లు : మన ఒంట్లోకి ఒకవేళ కరోనా వైరస్ చేరినా దాన్ని ప్రభావాన్ని నీళ్లు గణనీయంగా తగ్గిస్తాయి. పైగా ఇది మండువేసవి కావడం వల్ల సాధారణం కంటే కూడా ఎక్కువ నీళ్లు (అంటే రోజుకు కనీసం 4 లీటర్లకు తగ్గకుండా) తాగండి. ఇవేగాక... అవిశగింజలూ, గుమ్మడి గింజలు కూడా చాలా మేలు చేస్తాయి. దానికి తోడు చిలగడదుంపల వంటివి ఉడకబెట్టుకుని లేదా కాల్చుకుని తినడం కూడా మంచిదే. ఇందులో విటమిన్–ఏ, విటమిన్–సి ఉండటంతోపాటు... అది మన శరీరంలో గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పాళ్లను పెంచుతుంది. గ్లూటాథయోన్‌ను ‘మాస్టర్ యాంటీఆక్సిడెంట్’ అంటారు. ఇది మన కణాల్లో పేరుకున్న విషాలను బయటకు పంపి, వాటిని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బెడ్ టైమ్‌లో: ఇక చివరగా గోరు వెచ్చని పాలు తాగి నిద్రకు ఉపక్రమించడం మంచిది. అయితే ఈ పాలు వెన్న తీసినవైతే మరింత మంచిది. పాలలోని ట్రిప్టొఫాన్ అనే పోషకం రాత్రి బాగా నిద్రపట్టేలా చేస్తుంది. మంచి నిద్ర వ్యాధి నిరోధకతను బాగా పెంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి జింక్ మినరల్ చాలా ముఖ్యం. ఇది మాంసాహారం, చేపలు, గుడ్లు వంటి వాటితో పాటు పప్పు ధాన్యాలు, బీన్స్, నట్స్‌లో ఎక్కువ. అన్నిటికంటే ముఖ్యంగా... వ్యాధి నిరోధకత పెంపొందడానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ సమకూరడానికి విటమిన్–డి ఎంతో అవసరం. ఈ రెండు ప్రయోజనాలూ ఒకేసారి కలగాలంటే లేత ఎండలో వ్యాయామం మంచిది. పండ్లు ఇక ఈ సీజన్లో దొరికే మామిడితో పాటు నిమ్మ, నారింజ, కమలాలు, బత్తాయిలు, జామ వంటి విటమిన్–సి ఎక్కువగా పండ్లను ఎక్కువగా తీసుకోండి. వీటిలో లభ్యమయ్యే విటమిన్–సి చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల రోగనిరోధకతను ఎంతగానో పెంచుతుంది. మీ ఆహారంలో ఉసిరిని ఏదో రూపంలో తీసుకోవడం చాలా మంచిది. నారింజ, బత్తాయి, జామ వంటివి తినే సమయంలో జ్యూస్ రూపంలో కాకుండా పండ్లనే తినడం మేలు. జీనత్ ఫాతిమా డైటీషియన్, హైదరాబాద్ -
టెస్ట్‌లన్నీ నార్మల్... జబ్బు మాత్రం ఉంటుంది
గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని పిలిచే ఈ వ్యాధి చాలా చిత్రమైనది. చూడ్డానికి అంతా ఆరోగ్యంగానే అనిపిస్తుంది. వైద్య పరీక్షల్లో వైటల్స్ అని పిలుచుకునే నాడీ, రక్తపోటు... ఇవన్నీ సాధారణంగా నార్మల్‌గానే ఉండవచ్చు. కానీ అనారోగ్యమంతా ఆ అచేతనత్వంలోనే ఉంటుంది. కాళ్లూ, చేతులు, మెడ కండరాలతో పాటు... ఒక్కోసారి తలలోని కండరాలూ అచేతనం కావడంతో కళ్లు మూసుకోవడం కూడా సాధ్యం కాని పరిస్థితి. ఆ అరుదైన వ్యాధిపై అవగాహన కోసమే ఈ కథనం. మనలోని ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంటుంది. మెదడు నుంచి శరీరంలోని అన్ని భాగాలకూ నరాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ నరాలన్నింటిపైనా ‘మైలీన్’ అనే పొర ఉంటుంది. ఈ పొర ద్వారానే కదలికలకు సంబంధించిన సమాచారమంతా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారానే వెళ్తూ, వస్తూ ఉంటుంది. ఆ సిగ్నళ్ల ఆధారంగానే మన కండరాలు కదులుతుంటాయి. మనలోని వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన యాంటీబాడీస్ ఏ కారణం వల్లనో మన మైలీన్ పొరనే నాశనం చేస్తాయి. దాంతో ఈ ఎలక్ట్రిక్ సిగ్నళ్ల ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా అన్ని కండరాలూ అచేతమైపోతాయి. మొదట నరాలు అచేతనం కావడమన్నది పొడవైన నరం నుంచి ప్రారంభమవుతుంది. అందుకే మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుంటే కాలి నరాలు ప్రభావితం కావడం వల్ల కాళ్లు పడిపోతుండటం జీబీ సిండ్రోమ్‌లో మొట్టమొదట సాధారణంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అచేతనం కావడం అన్నది క్రమంగా పైవైపునకు పాకుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. అంటే... వీపు, చేతులు, మెడ కండరాలు, ఆ తర్వాత చివరగా ముఖం కండరాలు. ఇలా మనిషి మొత్తం... పూర్తిగా అచేతనమైపోతాడు. ఈ అచేతనం కావడం అన్నది అక్కడికే పరిమితమైపోకుండా క్రమంగా ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ కండరాలు కూడా ప్రభావితమౌతాయి. దాంతో ఊపిరితీసుకోవడం కష్టమై ప్రమాదకరంగా పరిణమిస్తుంది. వ్యాధి తీవ్రత : ఇలా కండరాలు అచేతనం కావడంలోని తీవ్రత చాలా స్వల్పంగా మొదలుకొని తీవ్రంగానూ ఉంటుంది. స్వల్పంగానే ఉంటే నడవడం కష్టమైపోతుంది. కానీ తీవ్రంగా ఉన్నప్పుడు రోగి పూర్తిగా మంచానికే పరిమితమైపోతాడు. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే కాళ్లూ, చేతులకు తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం వంటివి సంభవించవచ్చు. చాలా అరుదుగా కొందరిలో గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ కూడా అదేవిధంగా హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖంలో వేడి ఆవిర్లు వస్తున్నట్లుగా అనిపిసించడం, తీవ్రంగా చెమటలు పట్టడం, చాలా అరుదుగా మూత్రం కండరాలపైనా పట్టుకోల్పోయి, మూత్రం బయటకు వెళ్లకపోవడం జరగవచ్చు. వ్యాధి ఒకసారి కనిపించాక అది క్రమంగా 7 - 14 రోజుల పాటు క్రమంగా తీవ్రమవుతూ పోవచ్చు. ఆ తర్వాత మళ్లీ రోగి కోలుకోవడం మొదలై క్రమంగా మెరుగుపడవచ్చు.కానీ కొందరిలో మాత్రం పరిస్థితి ప్రమాదకరమై, అవాంఛిత పరిణామాలకు దారితీయవచ్చు. లక్షణాలు : శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియమ్ పాళ్లు తగ్గడం లేదా పెరగడం వంటి చాలా సాధారణ కారణాలతోనూ కనిపిస్తాయి. అయితే ఆ పరిస్థితిని చక్కదిద్దిన వెన్వెంటనే శరీరంలో కనిపించిన అచేతనత్వం తగ్గిపోతుంది. అప్పుడు రోగి కేవలం రెండు మూడు రోజుల్లోనే మామూలైపోతాడు. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి కండిషన్లలో కూడా జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు: గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని భావిస్తే తొలుత సాధారణ రక్తపరీక్ష చేసి అందులో పొటాషియమ్, క్యాల్షియమ్ పాళ్లను, క్రియాటినిన్ పాళ్లను పరిశీలిస్తారు. అవన్నీ సక్రమంగా ఉంటే నర్వ్ కండక్షన్ పరీక్షల ద్వారా జీబీ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. అయితే ఈ పరీక్ష వ్యాధి తీవ్రతను చెప్పలేదు. కొన్నిసార్లు వెన్ను నుంచి నీరు తీసి చేసే సెరిబ్రో స్పైనల్ ఫ్లుయిడ్ (సీఎస్ఎఫ్) పరీక్ష కూడా అవసరం కావచ్చు. చికిత్స: గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన రోగులకు అవసరాన్ని బట్టి శ్వాస అందించే వెంటిలేటర్ మీద పెట్టాల్సి ఉంటుంది. దాంతో పాటు అతడి రక్తపోటు (బీపీ)ని, గుండె వేగాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ... అవసరాన్ని బట్టి వాటిని సరిచేస్తూ ఉండేలా చికిత్స అందిస్తుండాలి. ఈ చికిత్సతో పాటు రోగి కండరాలకు బలం చేకూర్చేందుకు ‘ప్యాసివ్ ఫిజియోథెరపీ’ ప్రక్రియను కొనసాగించడమూ ప్రధానం. పైన పేర్కొన్న సాధారణ చికిత్సతోపాటు మరి రెండు చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనో గ్లోబ్యులిన్ చికిత్స: ఐదు రోజుల పాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లను ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ. ఇవి శరీరంలోని యాంటీబాడీస్ మనకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రతిబంధకంగా మారతాయి. (యాంటీబాడీస్‌ను బ్లాక్ చేస్తాయి). నరాల పై ఉండే మైలీన్ పొర మరింత ధ్వంసం కాకుండా చూస్తాయి. ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స: ఈ చికిత్స ప్రక్రియలో ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. ఇది దశలవారీగా జరుగుతుంది. నాలుగు నుంచి ఆరు విడతలుగా ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. రోజు విడిచి రోజు చేసే ఈ చికిత్సలో తొలగించిన ప్లాస్మాకు బదులు సెలైన్, ఆల్బుమిన్‌ను భర్తీ చేస్తారు. ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స చాలా ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స... దాదాపు సగం ఖర్చులోనే అవుతుంది. అయితే ఇక అచేతనమైన శరీర అవయవాలు వెంటనే పనిచేయడం ప్రారంభించవు. అయితే పూర్తిగా మెరుగుపడతాయని కూడా చెప్పడం కష్టం. కాకపోతే చికిత్స తీసుకోని రోగితో పోలిస్తే చికిత్స తీసుకున్న రోగిలో పరిస్థితి మెరుగవుతుంది. -
ఒంటరితనం.. ఓ మృత్యు కౌగిలి
వాషింగ్టన్: ఒంటరితనం ఓ ఫీలింగ్ మాత్రమే కాదు.. ఇది శారీరక మార్పులకు కారణమవ్వడమే కాక.. మరణానికి దగ్గరయ్యేలా చేస్తుందట. వృద్ధుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుందట. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు పెరగడానికి సాంఘిక ఒంటరితనం ప్రధాన కారణమని, దీనివల్ల వృద్ధుల్లో ముందుగానే మరణం సంభవించడానికి 14 శాతం అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఒంటరితనానికి.. కన్సర్వడ్ ట్రాన్స్క్రిప్షనల్ రెస్పాన్స్ టు ఎడ్వర్సిటీ(సీటీఆర్ఏ)కి సంబంధం ఉందని గత పరిశోధనల ఆధారంగా ఈ బృందం గుర్తించింది. అయితే ఒంటరితనం ప్రతికూల ఆరోగ్య ఫలితాలకు కారణమవుతుందనే అంశంపై మాత్రం ఎవరికీ అవగాహన పెద్దగా లేదు. ఇదే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ షికాగో సైకాలజిస్ట్ జాన్ కాకివొప్పొ నేతృత్వంలోని బృందం పరిశోధనలు జరిపింది. ఒంటరితనానికి సంబంధించి మనుషులతో పాటు రీసస్ మకాక్స్ అనే జాతి కోతులపైనా అధ్యయనం చేశారు. 2002లో 50 నుంచి 68 ఏళ్ల వ్యక్తులపై ఈ అధ్యయనాన్ని ప్రారంభించారు. ఈ పరిశోధనల్లో ఒంటరితనం అనుభవించే వారిలో రోగ నిరోధక ప్రతిస్పందనలు తక్కువగా ఉంటాయని వెల్లడైంది. ఈ నేపథ్యంలో కణాలలో జన్యు మార్పులు, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి శరీరాన్ని కాపాడే రోగ నిరోధక శక్తికి సంబంధించిన సెల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయనే దానిపై అధ్యయనం జరిపారు. ఈ పరిశోధనలో ఒంటరితనం కారణంగా శరీరంపై పడే పలు దుష్పరిణామాలు వెలుగుచూశాయి. ఒంటరితనం వల్ల శరీరంలో తెల్లరక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత ఒంటరితనం.. భవిష్యత్‌లో సీటీఆర్ఏ జన్యు ప్రక్రియను అంచనా వేస్తుందని, అలాగే ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత సీటీఆర్ఏ జన్యు ప్రక్రియ ఒంటరితనం పరిణామాలను అంచనా వేస్తుందని గుర్తించారు. కణాల జన్యు పరిణామాలు, ఒంటరితనం ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయని, కాలక్రమంలో ఇవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయని గుర్తించారు. ఈ పరిశోధన ఒంటరితనానికి మాత్రమే పరిమితమని, నిరాశ, ఒత్తిడి, సామాజిక మద్దతు మొదలైన అంశాలకు దీనికి సంబంధం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. -
చెంపలపై...బటర్‌ఫ్లై
మెడిక్షనరీ ముక్కుకు ఇరువైపులా చెంపల మీద సీతాకోకచిలుక ఆకృతిలో కనిపించే చర్మం మీద కనిపించే మచ్చల వల్ల ఈ సమస్యకు ‘బటర్‌ఫ్లై ర్యాష్’ అని పేరు. ల్యూపస్ అనే దీర్ఘకాలిక వ్యాధి వల్ల కనిపించే లక్షణమిది. ఇదొక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన వ్యాధి నిరోధకత మనపైనే దుష్ర్పభావం చూపడం వల్ల ఈ వ్యాధి కనిపిస్తుందన్నమాట. ఆటో ఇమ్యూన్ వ్యాధి కావడం వల్ల ఇది ఒక పట్టాన తగ్గే అవకాశం అంతగా ఉండదు. కానీ సన్‌స్క్రీన్ లోషన్స్ రాయడం, ఎండవేడిమి వెళ్లకుండా ఉండటం, కొన్ని రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడటం, ‘డీఎమ్‌ఏఆర్‌డీ’స్అని పిలిచే డిసీజ్ మాడిఫయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ వాడటం వంటి చికిత్సల వల్ల ఇది కాస్త అదుపులోకి వస్తుంటుంది. -
గార్డియన్ ఏంజెల్ ... ఆ జన్యువు!
మెడిక్షనరీ ఇక మనం ఒక కొత్త నినాదాన్ని అందుకుందాం. అదే... జీనో రక్షతి రక్షితః. అంటే... అత్యంత ప్రత్యేకమైన ఆ జన్యువును మనం రక్షించుకుంటే క్యాన్సర్ బారి నుంచి అది కాపాడుతుంది. అత్యంత ప్రత్యేకమైన ఆ జన్యువు (జీన్) పేరు రక్షించే దేవత. మానవ దేహంలో ఎన్నో జన్యువులు ఉన్నాయి. మరి ఈ జన్యువుకే ఈ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే... ఇది మన శరీరంలోని వ్యాధి నిరోధకశక్తిలో క్యాన్సర్ నుంచి ప్రత్యేకమైన రక్షణ ఇస్తుంది. సాధారణంగా పి-53 అని వ్యవహరించే ఈ జన్యువుకు రక్షించే దేవత అని పేరు. జీనోమ్ గార్డియన్ అని కూడా పిలుస్తారు. అయితే ఇంత విలువైన జన్యువును మన చేజేతులారా మనమే దెబ్బతీసుకుంటున్నాం. వేళకు సరిగా భోజనం చేయపోవడం, ఆహారంలో తగినన్ని తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోకపోవడం, నిత్యం వ్యాయామం చేయకపోవడం, మద్యం, పొగతాగే అలవాటు లాంటి దురలవాట్లు ఉండటం వంటి అనారోగ్యమైన జీవనశైలితో ఈ విలువైన జన్యువును దెబ్బతీసుకుంటున్నాం. అందుకే ఆరోగ్యమైన జీవనశైలిని అనుసరించి, విలువైన ఈ జన్యువును రక్షించుకోవడం అవసరం. -
ఎగ్జిమా
ఆయుర్వేద శాస్త్రానుసారం ఎగ్జిమా వ్యాధిని విచర్చికా వ్యాధిగా పిలుస్తారు. ఇది ఒక చర్మవ్యాధి. ఈ వ్యాధి మన శరీరంలో రోగ నిరోధక శక్తి హెచుతగ్గుల ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. పెద్దవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అకాల ఆహార విహారాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అజిన్ల వలన జీర్ణశక్తి తగ్గి పిత్తదోషం ప్రకోపించిదీనివలన ఆమము అనే విషపదార్థాలు శరీర కణాల్లో ఏర్పడి చర్మ భాగాన్ని దూషింప జేస్తాయి. ఈ కారణాల వలన విచర్చికా వ్యాధి ప్రారంభమవుతుంది. ఇది 3 రకాలుగా వర్ణిస్తారు. 1. వాత దోష విచర్చికా: చర్మం పొడి బారినట్లు ఉండి, నొప్పి, దురద ఉంటుంది. 2. కఫ దోష విచర్చికా: చర్మం దళసరిగా ఉండి దురద, తేమ కలిగి ఉంటుంది. 3. పిత్త రోష విచర్చికా: మంట, జ్వరం మొదలైన లక్షణాలతో చర్మం చిట్లినట్లు ఉంటుంది. వ్యాధి కారణాలు.. శీతల పదార్థాలు, ఉప్పు, కారం, మసాలాలు, అధిక మోతాదులో కలిగిన పదార్థాలు తీసుకోవటం వలన, నిల్వ ఆహారం తీసుకోవటం, నూనెతో చేసిన పదార్థాలు వాడటం వలన, నిద్రలేమి, ఆలస్యంగా భోజనం చేయటం, ఆల్కహాల్, టీ, కాఫీలు అధికంగా సేవించటం, మలబద్ధకం, అజీర్తి, ఒత్తిడి ఈ వ్యాధికి ముఖ్య కారణాలు. లక్షణాలు: దురద, చర్మం ఎర్రగా ఉండటం, ఎండిన చర్మం, చర్మంపై పొలుసులుగా ఏర్పడటం, వాపు, దురద, చర్మం మందబారటం, పొక్కులుగా ఏర్పడటం మొదలైన లక్షణాలు. తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. నూనె వస్తువులు, మసాలా, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు. 2. ఔషధ గుణాలు కల సబ్బులు వాడాలి. 3. రోగి దుస్తులు వేరొకరు వేసుకోరాదు. 4. వేళకు భోజనం చేయాలి. రాత్రి పూట ఎక్కువగా మేల్కొనరాదు. 5. ఒత్తిడి, ఆలోచనలు మానుకోవాలి. 6. చల్లిని గాలిలో, అతి ఎండలో తిరగరాదు. ఆయుర్వేద వైద్యంలో చక్కని ఔషధాలు విచర్చికా వ్యాధికి అందుబాటులో ఉన్నాయి. అనుభవం కలిగిన వైద్యుల సమక్షంలో వ్యాధి నిర్థారణ చేయించుకుని తగిన చికిత్స పొందితే శాశ్వతంగా ఎగ్జిమా వ్యాధిని నివారించుకోవచ్చు. -
ఏఫీమెరల్ ఫీవర్‌తో జాగ్రత్త
జన్నారం : పాడి పశువులు ప్రస్తుత సీజన్లో ఏఫీమెరల్ ఫీవర్‌కు గురవుతున్నాయి. ముందస్తుగా గుర్తించి వైద్య చికిత్స అందిస్తే నివారణ సులభమేనని, లేదంటే ప్రమాదకరమని తపాలపూర్ పశువైద్యాధికారి అజ్మీరా రాకేశ్ వివరించారు. దోమకాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీనిని మూడు రోజుల జ్వరంగా పేర్కొంటారు. వర్షాకాలంలో జూలై నుంచి అక్టోబర్ మాసాల మధ్య పాడిపశువులను పట్టి పీడిస్తుంది. దీనిపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా సందేహాలు ఉంటే ఫోన్లో సంప్రదించవచ్చు. లక్షణాలు దోమకాటుకు గురైన పశువుల్లో 104 నుంచి 106 ఫారెన్ హీట్ డిగ్రీల జ్వరం వస్తుంది. ఆకలి మందగిస్తుంది. నెమరు వేయవు. గడ్డి తినవు. నీళ్లు తాగవు. పార్డు లేక మలబద్ధకం కలిగి కంటి, ముక్కు నుంచి నీరు కారుతుంది. కీళ్లనొప్పులతో పశువులు లేవలేని స్థితిలో ఉంటాయి. కుంటుతాయి. జబ్బవాపు వ్యాధి వలే ఉంటుంది. ఆయాసం, దగ్గుతో పశువులు బాధపడుతాయి. ఇది మనుషులకు సోకే చికున్‌గున్యా వ్యాధి లక్షణాలు కలిగి ఉంటుంది. చికిత్స అతి జ్వరంతో బాధపడుతున్న పశువులకు సోడియం సాలిస్టేట్, పారాసెట్మాల్, నొప్పులు నివారించే ఇంజక్షన్‌ను పశువైద్యుల సూచన మేరకు ఇప్పించాలి. ఇది వైరల్ ఫివర్ కాబట్టి ఎటువంటి యాంటీబయాటిక్ మందులు ఇప్పించాల్సిన అవసరం లేదు. జ్వరం తగ్గిన తర్వాత నీరసం తగ్గించేందుకు బెలామీల్ ఇంజక్షన్ ఇప్పించాలి. జాగ్రత్తలు ఈ వ్యాధికి ప్రస్తుతం ఎలాంటి మందులు లేవు. వ్యాధి బారిన పడిన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు రెండేళ్ల సమయం పడుతుంది. ఈ వ్యాధికి గురైన పశువుల పాకలో దోమలు లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. పాడి పశువుల పాకల్లో వేప ఆకులు, గుగ్గిలం పొగ పెట్టాలి. దోమ చక్రాలు వెలిగించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. జ్వరం మూడు రోజులు ఉంటుంది కాబట్టి ప్రమాదకరం కాదు. అయితే సకాలంతో వైద్యం అందించకపోతే పశువు ప్రమాదానికి గురవుతుంది. -
చిన్నారులకు కొత్త టీకా
నిజామాబాద్ అర్బన్ : వ్యాధి నిరోధక శక్తి పెంచి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా శిశువులకు అందించే టీకాల పట్టికలో మరో కొత్త వ్యాక్సిన్ చేరనుంది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి బుధ, శనివారాల్లో సుమారు ఎనిమిదిన్నర వేల మంది చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు వేస్తున్నారు. ఇందులో ఇందులో భాగంగానే మరో కొత్త టీకా అందుబాటులోకి రానుంది. శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల చిన్నారి వరకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. బీసీజీ మొదలుకుని పోలియో చుక్కల వరకు క్రమం తప్పకుండా ఇస్తున్నారు. వీటి కోసం కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ కార్డు రూపొందించి, బీసీ జీ, ఓపీవీ, హైపటైసిస్ బి, డీపీటీ, మీసిల్స్, పోలియో, విటమిన్-ఎ వంటి వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. తాజాగా నెలన్నర, రెండున్నర, మూడున్నర నెలల చొప్పున వేసే డీపీటీ, హైపటైటిస్-బి , హిబ్ అనే మూడు రకాల టీకాలకు బదులుగా పెంటావాలెంట్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది. ఇది ఇప్పటికే ప్రైవేటులో లభిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ టీకాలను అక్టోబర్ నుంచి పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య, కుటుంబ శాఖ చర్యలు చేపట్టింది. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అందిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే ఈ వ్యాక్సిన్ ప్రవేశ పెట్టాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ వ్యాక్సిన్‌ను కూడా మూడుసార్లు వాయిదాల పద్ధతిలో ఒకటిన్నర, రెండు న్నర, మూడున్నర నెలల చొప్పున వేస్తారు. ప్రయోజనాలు ఇవీ... ఈ వ్యాక్సిన్ వయసుకు తగిన బరువు లేకపోవడం, వాంతులు, విరేచనాలతో బాధపడటం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో ఊపిరితిత్తుల వ్యాధిసోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. దీని ధర ప్రస్తుతం *600 చొప్పున మూడు డోసులకు * 1800 ఉంది. మెరుగైన వైద్య సేవలతో పాటు సులభంగా వ్యాక్సిన్ వేయాలనే ఉద్దేశంతో ధర ఎక్కువైనా ఈ వ్యాక్సిన్‌ను అందరికి అందుబాటులో తెస్తున్నట్లు ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. ప్రజలకు అవగాహన పెంటావాలెంట్ వ్యాక్సిన్ ప్రజలకు అందించేందుకు జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో సౌకర్యాలపై ప్రభుత్వం ఇప్పటికే వివరాలు సేకరించింది. వ్యాక్సిన్ స్టోర్ చేయడానికి కావాల్సిన వసతులు, రవాణా సౌకర్యం, సిబ్బంది కొరత , గతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన తీరుపై ప్రభుత్వం నివేదికలు సేకరించింది. వ్యాక్సిన్ గురించి ప్రజల్లో వీలైనంత త్వరగా అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నెలాఖరులోగా జిల్లాలోని ప్రభుత్వ వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చేదుకు అవసరమైన చర్యలు తీసుకుంది. అనంతరం డివిజన్, మండల స్థాయిల్లో ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది. -
సంక్రాంతి వేడుకలు
ఇంటింటా సంక్రాంతి సంబరాలు ఊపందుకున్నాయి. భోగ భాగ్యాలతో.. కలకాలం కలిసుండేలా దీవిస్తూ.. పాడిపంటలు సమృద్ధిగా పం డాలని ఆశీర్వదిస్తూ.. ముచ్చటైన మూడ్రోజుల పండుగ వస్తోంది. ఇప్పటికే ఇళ్లన్నీ సంక్రాంతి రుచులతో ఘుమఘుమలాడుతున్నాయి. బం ధువులతో సందడి మొదలైం ది. రేపు భోగి.. ఎల్లుండి సంక్రాంతి.. ఆ మరుసటి రోజు కనుమ పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. లక్ష్మీదేవికి ఆహ్వానం.. సంక్రాంతి పండుగకు, రైతుకు మధ్య విడదీయని బంధం ఉంది. ఏ పండుగకు ఇంట్లో చేరకపోయినా సంక్రాంతికి మాత్రం పంటలు చేతికంది ధాన్యరాసులు కళకళలాడుతుంటాయి. ఎంతో శ్రమకోర్చి పండించిన పంట ఇంటికి చేరిన తర్వాత చూసి రైతు కళ్లల్లో ఆనందం పొంగిప్రవహిస్తుంది. ఎండనక, వాననక, రేయనక, పగలనక తాను పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలంగా రైతు కుటుంబం సంక్రాంతి రోజు ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మను ఇంటి ముందు పెట్టి భూమాత రుణం తీర్చుకుంటుంది. ఆ రూపేణా ధాన్యలక్ష్మీ, పుష్పలక్ష్మీలను ఇంటిలోకి ఆహ్వానిస్తారు. గోమాత పేడతో కళ్లాపి చల్లి, గొబ్బెమ్మను పెట్టడంతో క్రిమికీటకాలు ఇంట్లోకి చేరే అవకాశాలు ఉండవు. పేడలో క్రిమికీటకాలను సంహరించే గుణం ఉండగా పసుపు, కుంకుమలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. పంట ఉత్పత్తులకు సంకేతం... సంక్రాంతి పండగకు పండించిన పంట ఉత్పత్తులను ఇళ్లలోగిళ్ల ముందు పెట్టి పూజలు చేస్తారు. వ్యవసాయ దేశం కావడంతో ప్రధానంగా రైతులు ఆహార ధాన్యాలను పండిస్తారు. అందుకు గుర్తుగా సంక్రాంతి రోజు ఇళ్లలోగిళ్లలో నవధాన్యాలైన బియ్యం(వడ్లు), గోధుమలు, కందులు, పెసర, శనిగలు, బబ్బెర్లు, మినుములు, నువ్వులు, ఉలువలు పెట్టి ప్రణమిల్లుతారు. గొబ్బెమ్మ చుట్టూరా గరకపోచలు, పండ్లు, కూరగాయలు పెట్టి సంతాన, సౌభాగ్యం ప్రసాదించాలని ఆకాంక్షిస్తారు. గంగిరెద్దుల విన్యాసాలు.. సంక్రాంతి వేడుకలు ఆరంభమైందంటే చాలు గంగిరెద్దు ఆటలు మొదలవుతాయి. వీధుల్లో, ముఖ్య కూడళ్లలో గంగిరెద్దులను ఆడిస్తుంటారు. అయ్యగారికి దండం పెట్టు... అమ్మగారికి దండం పెట్టు... ఇంటిళ్లిపాదిని సల్లంగ చూడు అంటూ డూడూ బసవన్నలను ఆడిస్తా రు. ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రా లను ఎద్దులకు అలంకరించి గంగిరెద్దులను తయారు చేస్తారు. గంగిరెద్దుల ఆటంటే చిన్నా, పెద్దా ఎవరికైనా ఆనందమే. నేలపై పడుకొని గంగిరెద్దును ఆమాంతం పైకి ఎక్కించుకోవడం, గంగిరెద్దు నోట్లో తలపెట్టడం వంటి విన్యాసాలు చూపరులను ఆశ్చర్యకితులను చేస్తాయి. గగురుపాటు కలిగిస్తా యి. సన్నాయి డోలు వాయిధ్యాలతో గంగిరెద్దులను ఇళ్ల ముంగిళ్లకు తీసుకువచ్చి ధాన్యరాసులను తీసుకెళ్తారు. రై తులు ఆనందంగా తోచిన రీతిలో గంగి రెద్దుల వారికి సమర్పించుకుంటారు. ఎద్దుల శ్రమను రైతుకు గుర్తు చేయడానికి పండుగ రోజు గంగిరెద్దులను ఇళ్లముందుకు తీసుకొస్తారు.