ఇంటింటా సంక్రాంతి సంబరాలు ఊపందుకున్నాయి. భోగ భాగ్యాలతో.. కలకాలం కలిసుండేలా దీవిస్తూ.. పాడిపంటలు సమృద్ధిగా పం డాలని ఆశీర్వదిస్తూ.. ముచ్చటైన మూడ్రోజుల పండుగ వస్తోంది. ఇప్పటికే ఇళ్లన్నీ సంక్రాంతి రుచులతో ఘుమఘుమలాడుతున్నాయి. బం ధువులతో సందడి మొదలైం ది. రేపు భోగి.. ఎల్లుండి సంక్రాంతి.. ఆ మరుసటి రోజు కనుమ పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.
లక్ష్మీదేవికి ఆహ్వానం..
సంక్రాంతి పండుగకు, రైతుకు మధ్య విడదీయని బంధం ఉంది. ఏ పండుగకు ఇంట్లో చేరకపోయినా సంక్రాంతికి మాత్రం పంటలు చేతికంది ధాన్యరాసులు కళకళలాడుతుంటాయి. ఎంతో శ్రమకోర్చి పండించిన పంట ఇంటికి చేరిన తర్వాత చూసి రైతు కళ్లల్లో ఆనందం పొంగిప్రవహిస్తుంది. ఎండనక, వాననక, రేయనక, పగలనక తాను పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలంగా రైతు కుటుంబం సంక్రాంతి రోజు ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మను ఇంటి ముందు పెట్టి భూమాత రుణం తీర్చుకుంటుంది. ఆ రూపేణా ధాన్యలక్ష్మీ, పుష్పలక్ష్మీలను ఇంటిలోకి ఆహ్వానిస్తారు. గోమాత పేడతో కళ్లాపి చల్లి, గొబ్బెమ్మను పెట్టడంతో క్రిమికీటకాలు ఇంట్లోకి చేరే అవకాశాలు ఉండవు. పేడలో క్రిమికీటకాలను సంహరించే గుణం ఉండగా పసుపు, కుంకుమలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది.
పంట ఉత్పత్తులకు సంకేతం...
సంక్రాంతి పండగకు పండించిన పంట ఉత్పత్తులను ఇళ్లలోగిళ్ల ముందు పెట్టి పూజలు చేస్తారు. వ్యవసాయ దేశం కావడంతో ప్రధానంగా రైతులు ఆహార ధాన్యాలను పండిస్తారు. అందుకు గుర్తుగా సంక్రాంతి రోజు ఇళ్లలోగిళ్లలో నవధాన్యాలైన బియ్యం(వడ్లు), గోధుమలు, కందులు, పెసర, శనిగలు, బబ్బెర్లు, మినుములు, నువ్వులు, ఉలువలు పెట్టి ప్రణమిల్లుతారు. గొబ్బెమ్మ చుట్టూరా గరకపోచలు, పండ్లు, కూరగాయలు పెట్టి సంతాన, సౌభాగ్యం ప్రసాదించాలని ఆకాంక్షిస్తారు.
గంగిరెద్దుల విన్యాసాలు..
సంక్రాంతి వేడుకలు ఆరంభమైందంటే చాలు గంగిరెద్దు ఆటలు మొదలవుతాయి. వీధుల్లో, ముఖ్య కూడళ్లలో గంగిరెద్దులను ఆడిస్తుంటారు. అయ్యగారికి దండం పెట్టు... అమ్మగారికి దండం పెట్టు... ఇంటిళ్లిపాదిని సల్లంగ చూడు అంటూ డూడూ బసవన్నలను ఆడిస్తా రు. ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రా లను ఎద్దులకు అలంకరించి గంగిరెద్దులను తయారు చేస్తారు. గంగిరెద్దుల ఆటంటే చిన్నా, పెద్దా ఎవరికైనా ఆనందమే. నేలపై పడుకొని గంగిరెద్దును ఆమాంతం పైకి ఎక్కించుకోవడం, గంగిరెద్దు నోట్లో తలపెట్టడం వంటి విన్యాసాలు చూపరులను ఆశ్చర్యకితులను చేస్తాయి. గగురుపాటు కలిగిస్తా యి. సన్నాయి డోలు వాయిధ్యాలతో గంగిరెద్దులను ఇళ్ల ముంగిళ్లకు తీసుకువచ్చి ధాన్యరాసులను తీసుకెళ్తారు. రై తులు ఆనందంగా తోచిన రీతిలో గంగి రెద్దుల వారికి సమర్పించుకుంటారు. ఎద్దుల శ్రమను రైతుకు గుర్తు చేయడానికి పండుగ రోజు గంగిరెద్దులను ఇళ్లముందుకు తీసుకొస్తారు.
సంక్రాంతి వేడుకలు
Published Sun, Jan 12 2014 4:09 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement
Advertisement