ఊరెళ్తున్నారా..? | Going home ..? | Sakshi
Sakshi News home page

ఊరెళ్తున్నారా..?

Published Wed, Jan 7 2015 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

ఊరెళ్తున్నారా..?

ఊరెళ్తున్నారా..?

ఇంటిల్లిపాదీ ఎక్కువ రోజులు ఊరెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. ప్రీతిపాత్రమైన ఇంటిపంటలను, పూలమొక్కలను, ఔషధమొక్కలను  బతికించుకోవడం ఎలా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ సమస్యకు ‘ఇంటిపంట’ బృంద సభ్యురాలు కాట్రగడ్డ వరూధిని సృజనాత్మకతను జోడించి.. ఖర్చులేని చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించారు. ఆమె 4 పొడవాటి కుండీల్లో ఆకుకూరలు పెంచుతున్నారు. వీటికన్నా ఎత్తులో ఒక స్టూల్‌పైన బక్కెట్ ఉంచి.. అందులో నీటిని నింపారు.

ఒక నూలు తాడును తీసుకొని.. ఒక చివరను బక్కెట్‌లో వేసి.. రెండో చివరను కుండీలోని మట్టిలో పెట్టారు. కదిలిపోకుండా చిన్న రాయిని కట్టారు. 4 కుండీలకూ ఇలాగే చేశారు. ఆ తాళ్ళ ద్వారా మొక్కల వేళ్లకు అవసరం మేరకు నీటి తేమ అందింది.  12 రోజుల తర్వాత ఆమె ఊరు నుంచి వచ్చి చూస్తే.. బక్కెట్‌లో చాలా నీరు ఖర్చయింది. ఆకుకూరలు ఏపుగా పెరుగుతూ పలకరించడంతో పట్టలేని సంతోషం కలిగింది! ఆ సంతోషాన్ని ఆమె ‘ఇంటిపంట’ ఫేస్‌బుక్ గ్రూప్ సభ్యులతో పంచుకున్నారు... ఇంకేముంది లైకుల పంట పండింది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement