
సాక్షి,నెహ్రూ సెంటర్: మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 24 గంటల్లో 19 కాన్పులు జరిగాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 19 ప్రసవాలు జరిగాయని, వాటిలో 15 సాధారణ, 4 సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రసవాల్లో అధిక రిస్క్ కేసులు కూడా ఉన్నాయని, కానీ తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు.
ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సాధారణ కాన్పులను పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఈ విజయం సాధించారని వివరించారు. కాన్పుల విభాగం అధిపతి డాక్టర్ బి.వెంకట్రాములు ఆధ్వర్యంలో స్త్రీ వైద్య నిపుణులు అలేఖ్య, శస్త్ర చికిత్స డ్యూటీ నిపుణులు శైలజ, శ్రావణి, మత్తు విభాగం వైద్యులు శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్ సేవలందించారని తెలిపారు. వారందరనీ కలెక్టర్ శశాంక అభినందించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment