న్యూఢిల్లీ: మంగళవారం అర్థరాత్రి ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్‌లోనూ గట్టిగానే ఉంది. భూప్రకంపనల వల్ల ప్రజలంతా భయభ్రాంతులకు గరవుతున్న సమయంలో కొందరు వైద్యులు ఏ మాత్రం బెదరకుండా ఓ మహిళకు డెలివరీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని ఎస్‌డీహెచ బిజ్‌బెహరా ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు సిజేరియన్ పద్ధతిలో డెలివరీ చేస్తున్నారు.
ఆ సమయంలో భూకంపనలు వచ్చాయి. అయినా సరే ఏ మాత్రం కంగారు పడకుండా వైద్యులు సురక్షితంగా సర్జరీ చేసి బిడ్డను వెలికితీశారు. అంతటి క్లిష్ట సమయాల్లో కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా తమ బాధ్యతను పూర్తి చేశారు. ఒక్క కాశ్మీర్ మాత్రమే కాదు, ఉత్తర భారతదేశం చాలా వరకు ఈ ప్రకంపనల ప్రభావం ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ భూకంప కేంద్రం ప్రకారం.. పాకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిజ్స్తాన్ వంటి ఇతర దేశాలు కూడా ఈ ప్రకంపనల వల్ల ప్రభావితమయ్యాయి.
Emergency LSCS was going-on at SDH Bijbehara Anantnag during which strong tremors of Earthquake were felt.
Kudos to staff of SDH Bijbehara who conducted the LSCS smoothly & Thank God,everything is Alright.@HealthMedicalE1 @iasbhupinder @DCAnantnag @basharatias_dr @DHSKashmir pic.twitter.com/Pdtt8IHRnh
— CMO Anantnag Official (@cmo_anantnag) March 21, 2023
Comments
Please login to add a commentAdd a comment