ఏదైనా ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే.. రెండు మూడు రోజులు లేదా ఓ పది రోజులలో డెలివరీ అయిపోతుంది. అయితే ఓ వ్యక్తికి మాత్రమే వింత అనుభవం ఎదురైంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టిన ఆరేళ్లకు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. దీంతో యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
ముంబైకి చెందిన అహ్సన్ ఖర్బాయి 2018 మే 16న ఫ్లిప్‌కార్ట్‌లో ఓ జత చెప్పులు ఆర్డర్ చేశారు. వీటి ధర 485 రూపాయలు. ఆర్డర్ చేసిన తరువాత మూడు రోజుల్లో షిప్పింగ్ అని స్టేటస్‌లో కనిపించింది. 20వ తేదీన డెలివరీ చేస్తామని వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే యూజర్ ఇప్పటి వరకు డెలివరీ పొందలేదు. ప్రతో రోజూ అరైవింగ్ టుడే అని మాత్రం కనిపించేది. మొత్తానికి ఇలా ఆరేళ్ళు గడిచిపోయింది.
After 6 yrs @Flipkart called me for this order 😂
Asking me what issue I was facing pic.twitter.com/WLHFrFW8FV— Ahsan (@AHSANKHARBAI) June 25, 2024
ఆర్డర్ పెట్టిన ఆరు సంవత్సరాలకు అహ్సన్ ఖర్బాయికు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. సమస్య ఏంటని ఆరా తీసింది. తనకు ఎదురైనా ఈ అనుభవాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
అహ్సన్ ఖర్బాయి ఆర్డర్ పెట్టినప్పుడే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నారు. కాబట్టి డెలివరీ గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆలస్యమైందని క్యాన్సిల్ కూడా చేయలేదు. దీనికి ఫ్లిప్‌కార్ట్ రిప్లై ఇస్తూ.. మీకు ఎదురైన ఈ అనుభవానికి క్షమించండి, ఇన్ని రోజులు ఎదురు చూటడం గొప్ప విషయం అని పేర్కొంది.
I'm really sorry for this experience. Our team has already gotten in touch with you on this and they are looking into your concern related to the recent order. Please be assured that you'll hear from us. Appreciate your patience.
— FlipkartSupport (@flipkartsupport) June 26, 2024
Comments
Please login to add a commentAdd a comment